MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Dada - Title Glimpse: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ 'దాదా'.. మాస్ అండ్ స్టైలిష్ గా గ్లింప్స్

Dada - Title Glimpse: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ 'దాదా'.. మాస్ అండ్ స్టైలిష్ గా గ్లింప్స్

Dada Title Glimpse: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘దాదా’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్‌తో బాలయ్య అదరగొట్టారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 06 2026, 07:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
‘దాదా’గా బాలయ్య.. టైటిల్ గ్లింప్స్ విడుదల
Image Credit : Asianet News

‘దాదా’గా బాలయ్య.. టైటిల్ గ్లింప్స్ విడుదల

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ఈ సినిమాకు ‘దాదా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదలైన గ్లింప్స్‌లో బాలకృష్ణ తనదైన స్టైలిష్ లుక్‌తో పాటు పవర్‌ఫుల్ యాక్షన్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. మాస్ హీరోగా బాలయ్యకు ఉన్న ఇమేజ్‌కు తగ్గట్టుగా ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను గోపీచంద్ మలినేని చూపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టైటిల్ గ్లింప్స్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవర్‌ఫుల్ డైలాగ్‌తో అదరగొట్టిన బాలయ్య
Image Credit : Asianet News

పవర్‌ఫుల్ డైలాగ్‌తో అదరగొట్టిన బాలయ్య

గ్లింప్స్‌లో బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. “అరే.. నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గరు ఉంటే సరిపోదు.. బుల్లెట్లకు బలుపు, గన్స్‌కు గట్స్ ఉండాలి” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ పక్కా మాస్ ఎలివేషన్‌గా నిలిచింది. స్టైలిష్‌గా కనిపిస్తూనే తనదైన మాస్ డైలాగ్స్, ప్రత్యేకమైన మేనరిజమ్స్‌తో బాలకృష్ణ గ్లింప్స్‌లో అదరగొట్టారు. యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య చూపించిన ఎనర్జీ కూడా అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌గా మారింది.

Related Articles

Related image1
G2 Movie: రిలీజ్ డేట్ రాలేదు, అయినా గూఢచారి 2 ఫస్ట్ రివ్యూ ఇదిగో..స్పై థ్రిల్లర్స్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్
Related image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
35
థమన్ బీజీఎం హైలైట్
Image Credit : Asianet News

థమన్ బీజీఎం హైలైట్

‘దాదా’ టైటిల్ గ్లింప్స్‌కు సంగీత దర్శకుడు థమన్ అందించిన నేపథ్య సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా థమన్ ఇచ్చిన బీజీఎం గ్లింప్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, బాలయ్య మాస్ ఎంట్రీలకు నేపథ్య సంగీతం మంచి బలాన్ని ఇచ్చింది. గతంలో బాలకృష్ణ సినిమాలకు థమన్ అందించిన సంగీతం అభిమానులను ఆకట్టుకున్న నేపథ్యంలో, ‘దాదా’ కోసం కూడా ఆయన అందిస్తున్న సంగీతంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

45
భారీ తారాగణంతో ‘దాదా’
Image Credit : Asianet News

భారీ తారాగణంతో ‘దాదా’

ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సముద్రఖని, శరత్ కుమార్, అభిమన్యు సింగ్, ఉపేంద్ర లిమాయే, మనీష్ వాధ్వా, స్వాసిక తదితరులు నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని కథ, రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

55
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల
Image Credit : Asianet News

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల

‘దాదా’ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రబృందం విడుదల తేదీని కూడా ప్రకటించింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను 2026 డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. రామ్-లక్ష్మణ్, వి వెంకట్, రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి పాటలకు సాహిత్యం అందిస్తున్నారు. స్టైలిష్ లుక్, మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో విడుదలైన ‘దాదా’ టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచగా, క్రిస్మస్ సందర్భంగా బాలయ్య మరో భారీ మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారనే అంచనాలు నెలకొన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image3
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Related Stories
Recommended image1
G2 Movie: రిలీజ్ డేట్ రాలేదు, అయినా గూఢచారి 2 ఫస్ట్ రివ్యూ ఇదిగో..స్పై థ్రిల్లర్స్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved