విడాకులు తీసుకోబోతున్న ఆసిన్ ? భర్తతో దూరంగా ఉంటోన్న స్టార్ హీరోయిన్..
టాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకోబోతుందా..? భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటోందా..? సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఎంత..?

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు.. విడాకులు ఎక్కువైపోయాయి. ఎన్ని పెళ్లిల్లు జరుగుతున్నాయో.. అన్ని విడాకుల కేసులు కూడా వస్తున్నాయి. తాజాగా స్టార్ సీనియర్ హీరోయిన్ ఆసిన్ తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజం ఎంత...?
టాలీవుడ్ లో ఎక్కువగా సక్సెస్ లు అందుకున్న హీరోయిన్లలో ఆసిన్ కూడా ఒకరు. మాస్ మహారాజ్ రవితేజ జోడీగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆసిన్. . ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు ఆమె గుమ్మం తొక్కాయి. అంతే కాదు వరు సక్సెస్ లు కూడా ఆసిన్ కెరీర్ కు బాగా ఉపయోగపడ్డాయి.
ఇక వెంట వెంటనే నాగార్జునతో శివమణి, బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్ తో ఘర్షణ, సినిమాలతో హిట్ల మీద హిట్లు కొట్టింది బ్యూటీ. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అన్నవరం, ప్రభాస్ తో చక్రం వంటి పెద్ద సినిమాలు కొన్ని నిరాశపరిచాయి. అయినా సరే ఈసినిమాలు ఆసిన్ కెరీర్ కు బాగా ఉపయోగపడ్డాయి.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఆసిన్.. తమిళ్ లో గజనీసినిమాతో స్టార్ గా మారింది. అటుబాలీవుడ్ లో అడుగు పెట్టి... అక్కడ కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ ను అందుకుంది. ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా.. 2016 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది ఆసిన్. అసిన్ భర్త రాహుల్ మైక్రో మాక్స్ కంపెనీ కి సి.ఈ.ఓగా పనిచేశారు.
ఆసిన్, రాహుల్ పెళ్లి జరగడానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముందుండి నడిపించినట్టు తెలుస్తోంది. ఇక ఈజంట చాలా కాలం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగా.. గత కొంత కాలం నుంచి మాత్రం వారి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ఇప్పుడు గాసిప్స్ మొదలయ్యాయి.
రాహుల్ శర్మ కొన్నాళ్లుగా వేరే అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడట. ఈ విషయం తెలుసుకున్న ఆసిన్.. ఒకటి రెండు సార్లు హెచ్చరించిందట. అయినా అతను వినకుండా తనకు నచ్చినట్టు చేస్తుండటంతో.. ఈమె అతని నుండి సెపరేట్ అయ్యి దూరంగా ఉంటుంనట్టుగా తెలుస్తోంది. తనకు పాప ఉన్నాసరే…ఆసిన్ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
asin
అయితే ఈ విషయాలు సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతుండగా.. అవి రూమర్స్ వరకే ఆగిపోతాయా..? లేక నిజం అవతాయా అనేది చూడాలి. ఈ రూమర్స్ పై ఆసిన్ స్పందిస్తే కాని అసలు విషయం వెల్లడి కాదు. మరి ఆసిన్ స్పందిస్తుందా..? లేదా అనేది చూడాలి.