MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్..చరణ్, బుచ్చిబాబు మూవీ గురించి షాకింగ్ సీక్రెట్స్ లీక్ చేసిన బిగ్ బాస్ సోహైల్

పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్..చరణ్, బుచ్చిబాబు మూవీ గురించి షాకింగ్ సీక్రెట్స్ లీక్ చేసిన బిగ్ బాస్ సోహైల్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కి రెడీ అవుతోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 03 2024, 09:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇంతలో రాంచరణ్ మరో క్రేజీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత రాంచరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నటించేందుకు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
#RC16

#RC16

ఈ మూవీపై రాంచరణ్, బుచ్చిబాబు ఇద్దరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదివరకే ఈ చిత్రానికి ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా ఉన్నాయి. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ ఈ చిత్రంలో ఉత్తరాంధ్ర మాండలీకంలో డైలాగులు చెప్పబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

36

రాంచరణ్, బుచ్చిబాబు చిత్రానికి సంబంధించిన షాకింగ్ విషయాలని బిగ్ బాస్ సోహైల్ లీక్ చేశాడు. సోహైల్ కి రాంచరణ్ సినిమా సంగతులు ఎలా తెలుసు అనే అనుమానం రావచ్చు. సోహైల్ రీసెంట్ గా బూట్ కట్ బాలరాజు చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో సోహైల్ బిజీగా ఉన్నాడు. 

46

ఓ ఇంటర్వ్యూలో సోహైల్ రాంచరణ్, బుచ్చిబాబు సినిమా విశేషాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోహైల్ మాట్లాడుతూ బుచ్చిబాబు అన్న నాకు బాగా క్లోజ్. నేను రెగ్యులర్ గా బుచ్చిబాబు అన్నతో మాట్లాడుతుంటాను. నా సమస్యలు కూడా అన్నకి చెప్పుకుంటాను. బుచ్చిబాబు అన్న నాకు అంత మంచి ఫ్రెండ్. 

56

రీసెంట్ గా బుచ్చిబాబు అన్నని కలిశాను. రాంచరణ్ గారితో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు.. బిగ్ అఛీవ్మెంట్ మీకు ఇది అని చెప్పను. వెంటనే బుచ్చిబాబు అన్న మాట్లాడుతూ పాన్ ఇండియా కాదు అది పాన్ వరల్డ్ మూవీ అని చెప్పారు. సోహైల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాంచరణ్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. 

66

బుచ్చిబాబు ప్లానింగ్ మాములుగా లేదే అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం గురించి రాంచరణ్ గతంలోనే కామెంట్స్ చేశారు. ఈ చిత్ర కథ ఇండియన్ నేటివిటీలో డీప్ గా ఉంటూ ప్రపంచ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చరణ్ నేషనల్ మీడియాకి తెలిపారు. ఇదంతా చూస్తుంటే చరణ్, బుచ్చిబాబు నుంచి కనీవినీ ఎరుగని చిత్రం రాబోతున్నట్లు అర్థం అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ఓ కొలిక్కి రాగానే బుచ్చిబాబు చిత్రం షురూ కానుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT : ఈ వీకెండ్ ఓటీటీలో దుమ్మురేపే 10 కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే! ఎంజాయ్ చేయండి మరి
Recommended image2
Rajamouli: రాజమౌళి కొడుకు హీరోగా సినిమా, డైరెక్టర్ ఎవరు? జక్కన్నషాకింగ్ నిర్ణయం వెనుక కారణం ఏంటి?
Recommended image3
Roja Selvamani: ఐరన్ లెగ్ అంటూ రోజాపై దారుణంగా ట్రోల్స్, నేపాల్ వరదలు, నగరి పులిహోర ఘటనపై విమర్శలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved