MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajamouli: రాజమౌళి కొడుకు హీరోగా సినిమా, డైరెక్టర్ ఎవరు? జక్కన్నషాకింగ్ నిర్ణయం వెనుక కారణం ఏంటి?

Rajamouli: రాజమౌళి కొడుకు హీరోగా సినిమా, డైరెక్టర్ ఎవరు? జక్కన్నషాకింగ్ నిర్ణయం వెనుక కారణం ఏంటి?

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ హీరోగా ఓ సినిమా స్టార్ట్ అయ్యిందని మీకు తెలుసా? కానీ ఆ సినిమా ముందుకు వెళ్లకుండా ఆగిపోవడానికి కారణం ఏంటి? రాజమౌళి నిర్ణయం వెనుక ఆలోచన ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 05 2026, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రపంచం మెచ్చిన తెలుగు దర్శకుడు..
Image Credit : others

ప్రపంచం మెచ్చిన తెలుగు దర్శకుడు..

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన జక్కన్న, అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన రూపొందించే ప్రతి చిత్రం ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఎంతో గుర్తింపు పొందుతుంది. జేమ్స్ కేమరూన్ లాంటి దర్శకుడే రాజమౌళి ప్రతిభ గురించి ప్రశంసలు కురిపించాడంటే, ఆయన గురించి అంతకంటే ఎక్కువ ఏం చెప్పగలం! స్ట్రాంగ్ ఎమోషన్స్, గ్రాండ్ విజువల్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ అన్ని రకాల ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే రాజమౌళి ప్రత్యేకత. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా ఉన్న రాజమౌళి, తన కుమారుడు కార్తికేయను కూడా మొదటి నుంచీ సినీ రంగంలోనే ప్రోత్సహిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నిర్మాతగా రాణిస్తున్న కార్తికేయ..
Image Credit : Asianet News

నిర్మాతగా రాణిస్తున్న కార్తికేయ..

రాజమౌళి తనయుడు కార్తికేయ మొదటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాడు. జక్కన్నతో కలిసి ప్రతీ సినిమాకూ పనిచేశాడు. 'బాహుబలి' వంటి దృశ్యకావ్యానికి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి తన నిర్మాణ నైపుణ్యాన్ని చాటుకున్నాడు. ఆ తర్వాత 'ఆకాశవాణి' వంటి ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తూ, ప్రస్తుతం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే, చాలామందికి తెలియని ఆసక్తికర విషయమేమిటంటే.. కార్తికేయ కెరీర్ బిగినింగ్‌లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయి.

34
హీరోగా రాజమౌళి తనయుడు..?
Image Credit : Asianet News

హీరోగా రాజమౌళి తనయుడు..?

గతంలో రాజమౌళి వద్ద పనిచేసిన ఒక అసోసియేట్ డైరెక్టర్, కార్తికేయను హీరోగా పరిచయం చేయడానికి ఒక సినిమాను స్టార్ట్ చేశాడట. ఆ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే, మొదటి షెడ్యూల్ రష్ చూసిన తర్వాత రాజమౌళి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్తికేయకు నటన లేదా కెమెరా ముందుకు వచ్చి హీరోగా చేయడం కంటే ప్రొడ్యూసర్‌గా ఉండటమే ఇష్టమన్న అభిప్రాయం కనిపించిందట.

ఆయనకు నిర్మాణ, వ్యాపార రంగంపైనే ఎక్కువ నైపుణ్యం, ఆసక్తి ఉన్నాయని రాజమౌళి గమనించారు. "కార్తికేయకు నటన కంటే బిజినెస్ రంగాన్నే చక్కగా నిర్వహించే స్కిల్స్ ఉన్నాయి. సినిమా రంగానికి సంబంధించి ప్రొడక్షన్, బిజినెస్ మైండ్‌సెట్ వైపే రాణించగలడు" అని భావించి, వెంటనే ఆ సినిమాను నిలిపివేశారట. అలా కార్తికేయ హీరోగా ప్రారంభమైన ఆ సినిమా మొదటి షెడ్యూల్‌తోనే రద్దయిందని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

44
తండ్రి నిర్ణయానికి కట్టుబడి ఉన్న కార్తికేయ..
Image Credit : Asianet News

తండ్రి నిర్ణయానికి కట్టుబడి ఉన్న కార్తికేయ..

తండ్రి ఇచ్చిన సలహా, మార్గదర్శకత్వంతో కార్తికేయ కూడా నటనపై దృష్టి పెట్టకుండా నిర్మాణ రంగంపైనే తన దృష్టిని కేంద్రీకరించాడు. ప్రస్తుతం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' వంటి ప్రాజెక్టులతో ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి సరైన సమయంలో తీసుకున్న ఆ నిర్ణయమే కార్తికేయను నటుడిగా కాకుండా ఒక నైపుణ్యం కలిగిన నిర్మాతగా, ప్రొడక్షన్ హెడ్‌గా టాలీవుడ్‌లో స్థిరపడేలా చేసింది. ఫ్యూచర్‌లో కార్తికేయ డైరెక్టర్‌గా కూడా మారే అవకాశం లేకపోలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే
Recommended image2
Jr NTR: నా ఇమేజ్ వల్ల ఆ సినిమా పాడైపోయేది, అందుకే పక్కన పెట్టా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఆలోచించారా ?
Recommended image3
ఎక్కువ సినిమాలు చేసిన పాపానికి తప్పుడు లింకులు పెట్టారు.. సీనియర్ నటి సంచలన కామెంట్స్
Related Stories
Recommended image1
ANR: ఏఎన్నార్ ఇచ్చిన 1 లక్ష రెమ్యునరేషన్ తో 5 ఎకరాలు కొని, కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Roja Selvamani: ఐరన్ లెగ్ అంటూ రోజాపై దారుణంగా ట్రోల్స్, నేపాల్ వరదలు, నగరి పులిహోర ఘటనపై విమర్శలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved