మార్నింగ్ కాఫీ తాగుతూ అషురెడ్డి దర్శనం.. పొట్టి డ్రెస్ లో స్టన్నింగ్ సిట్టింగ్ పోజులో జూ.సమంత మెరుపులు
యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా కాఫీ తాగుతూ దర్శనమిచ్చింది.
డబ్ స్మాష్ వీడియోలతో అషురెడ్డికి మంచి క్రేజ్ దక్కింది. తను చేసే వీడియోలతో జూనియర్ సమంతగానూ గుర్తింపు దక్కింది. ఆ క్రేజ్ తోనే నెమ్మదిగా సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చింది. దాంతో అషురెడ్డికి ‘బిగ్ బాస్’తెలుగు రియాలిటీ షోలో అవకాశం వచ్చింది.
కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో మొదటిసారిగా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సీజీన్ 5లోనూ ఛాన్స్ దక్కించుకొని హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు సార్లు ఈ పాపులర్ రియాలిటీ షోలో సందడి చేసింది.
హౌజ్ నుంచి బయటకి వచ్చాకా అషురెడ్డికి తన గుర్తింపు లభిస్తోంది. నటిగా ఎదగాలనే తన లక్ష్యానికి అనుగుణంగా అవకాశాలు దక్కుతున్నాయి. ఇఫ్పుడిప్పుడే ఆఫర్లను అందుకుంటూ వస్తోంది. వచ్చిన ఏ చిన్న ఛాన్స్ ను కూడా వదులుకోవడం లేదు.
ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. తన ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు పలకరిస్తూ ఉంటోంది. ఈక్రమంలో యంగ్ బ్యూటీ అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది.
తాజాగా అషురెడ్డి క్యాజువల్ గా మెరిసినా అందాలతో మతులు పోగొట్టింది. తన మార్నింగ్ కాఫీని తాగుతూ దర్శనమిచ్చింది. పొట్టి డ్రెస్ లో ఓ కుర్చీలో కూర్చున్న ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ పోజులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది.
గ్లామర్ షోలో ఎప్పుడో బౌండరీలు దాటిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇలా పొట్టి డ్రెస్ లో థైస్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తన రోటీన్ మార్నింగ్ గురించి చెప్పే ప్రయత్నంలో ఇలా ఫొటోలను షేర్ చేసుకుంది. చివరిగా ‘ఫోకస్’చిత్రంలో అలరించగా.. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ మూవీలో నటిస్తోంది.