MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Udaya Bhanu: నా కలకు ప్రాణం పోసిన వ్యక్తి.. స్టేజీపైనే ఏడ్చేసిన ఉదయభాను.. ఎవరు వాళ్లు?

Udaya Bhanu: నా కలకు ప్రాణం పోసిన వ్యక్తి.. స్టేజీపైనే ఏడ్చేసిన ఉదయభాను.. ఎవరు వాళ్లు?

Udaya Bhanu: బుల్లితెర క్వీన్ ఉదయభాను ‘పంచనామా’ వెబ్ సిరీస్‌తో నిర్మాతగా మారారు. అయితే, ప్రివ్యూ ఈవెంట్‌లో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఉదయభాను ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? ఆమె లైఫ్ లో ఆ స్పెషల్ పర్సన్ ఎవరు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 10 2026, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. 15 ఏళ్ల ఆవేదన వెనుక ఉన్న అసలు నిజం ఇదే
Image Credit : Instagram/iamudayabhanu, zee5

కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. 15 ఏళ్ల ఆవేదన వెనుక ఉన్న అసలు నిజం ఇదే

ఒకప్పుడు బుల్లితెరపై తన మార్క్ యాంకరింగ్‌తో ప్రతి ఇంట్లో ‘హృదయభాను’గా మారిన ఉదయభాను, ఆ తర్వాత నటిగానూ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు తన జీవితంలో మరో కొత్త చాప్టర్ స్టార్ట్ చేశారు. ‘ఉదయభాను ప్రొడక్షన్స్’ అనే బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారారు. ఈ బ్యానర్‌లో ఫస్ట్ అటెంప్ట్‌గా ‘పంచనామా’ అనే సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్‌ను నిర్మించారు.

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఉదయభాను, 15 ఏళ్లుగా తాను నిర్మాతగా మారాలని కన్న కల ఈ రోజు నెరవేరిందని చెప్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకుంటూ తన మనసులోని ఆవేదనను, పడ్డ కష్టాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన ప్రయాణం
Image Credit : Asianet News

బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన ప్రయాణం

"ఈరోజు ఎలాగైనా ఎమోషనల్ కాకూడదు అనుకున్నా, కానీ కన్నీళ్లు ఆగడం లేదు" అంటూ ఉదయభాను మాట్లాడటం ప్రారంభించారు. "నాకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు, స్టూడియోలు లేవు, పెద్దవాళ్లకు పుట్టిన బిడ్డను అంతకంటే కాదు. 12 ఏళ్ల చిన్న వయసులోనే మైక్ పట్టుకుని స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడిదాకా వచ్చాను. టెలివిజన్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది, అందుకే టీవీ ప్లాట్‌ఫామ్‌తోనే నా ప్రొడక్షన్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నా.

కానీ గత 15 ఏళ్లుగా ఎన్నో కథలు పట్టుకుని తిరిగినా ప్రాజెక్ట్‌లు ఓకే కాలేదు. వచ్చే వారం, వచ్చే నెల మొదలవుతుంది అనుకోవడానికే ఇన్నేళ్లు పట్టింది. ఈ క్రమంలో రోజుకు రెండు గంటలు కూడా సరిగ్గా నిద్రపోకుండా కష్టపడ్డాను" అని చెప్పుకొచ్చారు.

Related Articles

Related image1
Maruti Suzuki: మారుతి నుంచి మైండ్ బ్లాకింగ్ కారు.. రూ. 5 లక్షలకే 34KM మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్
Related image2
PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి
36
జీ5 ఎంట్రీతో మారిన సీన్
Image Credit : Asianet News

జీ5 ఎంట్రీతో మారిన సీన్

తాను గతంలో చేసిన ప్రాజెక్ట్ సమయంలో జీ5 టీమ్‌ను కలిసే అవకాశం వచ్చిందని, తన స్నేహితుడు శ్రీరామ్ ద్వారా జీ5 హెడ్ అనురాధను కలిశానని ఉదయభాను తెలిపారు. తన దగ్గరున్న కాన్సెప్ట్స్ వివరించగా, అనురాధ మేడమ్ తనపై ఉన్న నమ్మకంతో ఈ ‘పంచనామా’ ప్రాజెక్ట్‌ను ఓకే చేశారని చెప్పారు.

తన కలకు ప్రాణం పోసిన అనురాధ మేడమ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, తన బ్యానర్ ఎంత పెద్దగా ఎదిగినా ఆమె పేరు గుండెల్లో ఉంటుందని ఉదయభాను ఎమోషనల్ అయ్యారు. అలాగే, ఈ సిరీస్ కోసం కొంతమంది స్టార్ హీరోలను సంప్రదిస్తే, వారు ఏకంగా సిరీస్ బడ్జెట్ అంత రెమ్యునరేషన్ అడిగారని, ఆ సమయంలో భరత్ గారు కథ నచ్చి ప్రాజెక్ట్‌లోకి రావడం చాలా ప్లస్ అయిందని చెప్పారు.

46
కొత్త టాలెంట్‌కు ఓపెన్ డోర్స్
Image Credit : Asianet News

కొత్త టాలెంట్‌కు ఓపెన్ డోర్స్

"జీవితంలో ఎన్నిసార్లు కిందపడినా ప్రతిసారీ డబుల్ ఎనర్జీతో తిరిగి లేచి నిలబడ్డాను, ఇప్పుడు పరుగెత్తడం కూడా నేర్చుకున్నాను" అని ఉదయభాను చెప్పారు. తనలాగే ఇండస్ట్రీలో సరైన అవకాశాలు లేక ఇబ్బందిపడే ప్రతిభావంతులకు తోడ్పడటమే తన ప్రొడక్షన్ హౌస్ మెయిన్ గోల్ అని స్పష్టం చేశారు.

"టాలెంట్ ఉండి, ఎక్కడ తలుపులు మూసుకుపోయినా 'ఉదయభాను ప్రొడక్షన్స్' డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి" అని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ను ఒక బిడ్డలా చూసుకుని, తక్కువ సమయంలోనే క్వాలిటీగా తీర్చిదిద్దిన డైరెక్టర్ మోహన్ శ్రీవత్స, కో-ప్రొడ్యూసర్ విజయేంద్ర మౌళి, రైటర్ నాగేంద్రతో పాటు టెక్నికల్ టీమ్‌కి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

56
సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్
Image Credit : X/zee5

సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్

హీరో భరత్ నివాస్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌లో స్క్రీన్‌ప్లే చాలా పక్కాగా ఉందని, ప్రేక్షకులను ఆరు ఎపిసోడ్లు బింజ్ వాచ్ చేసేలా దర్శకుడు మోహన్ డిజైన్ చేశారని ప్రశంసించారు. హీరోయిన్ మేథారెడ్డి, నటులు సూర్య శ్రీనివాస్, శ్రీజ, శివ కార్తీక్ కూడా ఈ సిరీస్‌లో పనిచేయడం గొప్ప ఎక్స్‌పీరియన్స్ అని పంచుకున్నారు.

ఒక మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీ ఇంకో అనుమానానికి దారితీసే కథాంశంతో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా' సెప్టెంబర్ 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. చూసిన ప్రతి ఒక్కరూ స్క్రీన్‌ప్లే, గ్రిప్పింగ్ ఎలిమెంట్స్‌కు ఫిదా అవుతారని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది.

66
‘పంచనామా’ ప్రాజెక్ట్ వివరాలు
Image Credit : Instagram/zee5telugu

‘పంచనామా’ ప్రాజెక్ట్ వివరాలు

వెబ్ సిరీస్‌: పంచనామా

బ్యానర్: ఉదయభాను ప్రొడక్షన్స్

ప్రధాన పాత్ర: భరత్ నివాస్ (జై రామ్)

దర్శకత్వం: మోహన్ శ్రీవత్స

ఎపిసోడ్‌లు : 6 ఎపిసోడ్లు

ఓటీటీ ప్లాట్‌ఫామ్: ZEE5

స్ట్రీమింగ్ డేట్: సెప్టెంబర్ 11

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya: దీపావళి బరిలో సీన్.. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన సూర్య.. అదరగొడుతున్న టీజర్!
Recommended image2
Bigg Boss Telugu: బిగ్ బాస్ 10 తెలుగులో ఆ కామనర్ పై సెలబ్రిటీల గ్రూప్ దాడి.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
Recommended image3
Srikanth: డిప్రెషన్‌లో హీరో శ్రీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఏమన్నాడో తెలుసా? దెబ్బకు సెట్ అయిన ఫ్యామిలీ హీరో
Related Stories
Recommended image1
Maruti Suzuki: మారుతి నుంచి మైండ్ బ్లాకింగ్ కారు.. రూ. 5 లక్షలకే 34KM మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్
Recommended image2
PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved