MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Srikanth: డిప్రెషన్‌లో హీరో శ్రీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఏమన్నాడో తెలుసా? దెబ్బకు సెట్ అయిన ఫ్యామిలీ హీరో

Srikanth: డిప్రెషన్‌లో హీరో శ్రీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఏమన్నాడో తెలుసా? దెబ్బకు సెట్ అయిన ఫ్యామిలీ హీరో

Srikanth: టాలీవుడ్‌లో మహిళా ప్రేక్షకుల్లో ఆ కాలంలో విపరీతమైన స్టార్ ఇమేజ్ ఉన్న హీరో శ్రీకాంత్. ఆయన సినిమా రిలీజ్ అయితే పండగే.. అటు వంటి హీరో.. ఒకప్పుడు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందట. అప్పుడు చిరంజీవి ఏం చేశారో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 10 2026, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మినిమమ్ గ్యారెంటీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌
Image Credit : Zee Telugu

మినిమమ్ గ్యారెంటీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు హీరో శ్రీకాంత్. కుటుంబ కథా చిత్రాలకు, మినిమమ్ గ్యారెంటీ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. ప్రతి నటుడి జీవితంలో లాగే శ్రీకాంత్ సినీ కెరీర్‌లో కూడా ఎన్నో గెలుపోటములు, హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒకానొక దశలో ఆయన తీవ్రమైన ఒత్తిడికి, డిప్రెషన్‌కు లోనైన పరిస్థితులను చూశారు. సినీ పరిశ్రమలో విజయం ఎంత వేగంగా వస్తుందో, ఫెయిల్యూర్ కూడా అంతే వేగంగా మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. అటువంటి కష్ట సమయంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు తనపై ఎలాంటి ప్రభావం చూపించాయనే విషయాన్ని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మానసిక ఒత్తిడి - కుటుంబ సభ్యుల ఆందోళన
Image Credit : https://www.facebook.com/ActorSrikanthMeka

మానసిక ఒత్తిడి - కుటుంబ సభ్యుల ఆందోళన

సినిమా పరిశ్రమలో వరుస ఫెయిల్యూర్స్ లేదా అనుకున్న ఫలితాలు రానప్పుడు నటులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. శ్రీకాంత్ కూడా అటువంటి డిప్రెషన్ అనుభవించిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా భయపడిపోయారు. ముఖ్యంగా శ్రీకాంత్ తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారట.

"వీడు అనవసరంగా ఇండస్ట్రీకి వచ్చాడు, ఇంతలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నాడేంటి?" అని నాన్నగారు, అమ్మగారు భయపడ్డారని శ్రీకాంత్ తెలిపారు. అంతేకాదు "నువ్వు మరీ ఇంతగా కుంగిపోతే ఎలా? అనవసరంగా వచ్చాం, పద ఊరికి వెళ్ళిపోదాం" అని కూడా ఆయనను ఒత్తిడి నుంచి కాపాడేందుకు కుటుంబ సభ్యులు సూచించిన సందర్భాలు ఉన్నాయట.

35
షూటింగ్ స్పాట్‌కు పిలిచిన చిరంజీవి... ఏం చెప్పారంటే?
Image Credit : https://www.facebook.com/ActorSrikanthMeka

షూటింగ్ స్పాట్‌కు పిలిచిన చిరంజీవి... ఏం చెప్పారంటే?

శ్రీకాంత్ వరుస ప్లాప్‌ల వల్ల తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నారనే విషయం తెలిసిన చిరంజీవి వెంటనే స్పందించారు. ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న తన సినిమా షూటింగ్ స్పాట్‌కు శ్రీకాంత్‌ను పిలిపించారు. శ్రీకాంత్‌ను పక్కన కూర్చోబెట్టుకుని, "ఏంట్రా చాలా డల్లుగా ఉంటున్నావు, ఏమైంది?" అని ప్రేమగా ప్రశ్నించారు. శ్రీకాంత్ తన మనసులోని బాధను, కంటిన్యూస్‌గా సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందిని చిరంజీవితో పంచుకున్నారు.

45
చిరంజీవి చెప్పిన జీవిత పాఠం
Image Credit : Actor Srikanth\facebook

చిరంజీవి చెప్పిన జీవిత పాఠం

శ్రీకాంత్ బాధను విన్న చిరంజీవి .. తన సొంత సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను ఉదాహరణగా చెప్తూ శ్రీకాంత్‌కు గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు. "నువ్వు మొదట ఈ పరిశ్రమకు వద్దామని కూడా అనుకోలేదు, కానీ వచ్చావు.. హీరోగా నిలబడ్డావు. అది దేవుడు నీకిచ్చిన అతిపెద్ద వరం. విజయాలను ఎలాగైతే ఆస్వాదిస్తావో, వైఫల్యాలను కూడా అంతే సాధికారికంగా, స్పోర్టివ్‌గా తీసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ డిప్రెషన్‌కి వెళ్ళకూడదు. డిప్రెషన్‌లోకి వెళ్లి, అనవసర అలవాట్లకు బానిసై నిన్ను నువ్వు పాడుచేసుకుంటే కుటుంబానికి, నిన్ను నమ్మిన వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది." అని చెప్పారు.

55
శ్రీకాంత్‌లో వచ్చిన మార్పు
Image Credit : zee telugu

శ్రీకాంత్‌లో వచ్చిన మార్పు

ఫెయిల్యూర్స్‌ను జయించడానికే ముందుకు వెళ్లాలి తప్ప వెనకడుగు వేయకూడదని చిరంజీవి దిశానిర్దేశం చేశారు. మెగాస్టార్ చెప్పిన ఆ మాటలు శ్రీకాంత్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ రోజు నుంచి ఆయన తన మానసిక స్థితిని పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. ప్లాప్‌లు వచ్చినా కుంగిపోకుండా, మళ్లీ ధైర్యంగా ముందుకు సాగడం అలవాటు చేసుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mukesh: హౌస్ లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, చిన్నదోవైపు పెద్దదోవైపు..ఆ ముగ్గురిపై ముకేశ్ తీవ్ర వ్యాఖ్యలు
Recommended image2
Kareena Kapoor: మాజీ ప్రియుడి భార్యని హోస్ట్ చేసిన కరీనా కపూర్..అభిమానుల ఫన్నీ కామెంట్స్
Recommended image3
Yuvan Shankar Raja: సూర్య నుంచి అజిత్ వరకు..క్రేజీ హీరోలతో 8 వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్
Related Stories
Recommended image1
ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?
Recommended image2
కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved