MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Suriya: దీపావళి బరిలో సీన్.. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన సూర్య.. అదరగొడుతున్న టీజర్!

Suriya: దీపావళి బరిలో సీన్.. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన సూర్య.. అదరగొడుతున్న టీజర్!

Suriya: హీరో సూర్య, డైరెక్టర్ జిత్తు మాధవన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్, టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 10 2026, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వరుస విజయాలతో దూసుకుపోతున్న సూర్య..
Image Credit : X

వరుస విజయాలతో దూసుకుపోతున్న సూర్య..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూర్య ప్రస్తుతం హిట్‌మ్యాన్‌గా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మొదటగా వచ్చిన 'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆగస్టులో విడుదలైన 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా రూ.250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ప్లాన్..
Image Credit : youtube

హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ప్లాన్..

ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సూర్య సిద్ధమయ్యాడు. తన 47వ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు. మలయాళంలో 'రోమాంచం', 'ఆవేశం' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన జిత్తు మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నటి జ్యోతిక తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తుండగా, మలయాళ నటుడు నస్లెన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

Related Articles

Related image1
Srikanth: డిప్రెషన్‌లో హీరో శ్రీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఏమన్నాడో తెలుసా? దెబ్బకు సెట్ అయిన ఫ్యామిలీ హీరో
Related image2
కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
34
సూర్య 47వ సినిమా టైటిల్
Image Credit : youtube

సూర్య 47వ సినిమా టైటిల్

సూర్య 47వ చిత్రానికి 'సీన్' అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన మాస్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో సూర్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో సూర్యతో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రాజ్‌ప్రియన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించాడు. గతేడాది చివర్లో చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కేరళలో కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో, సూర్య అభిమానులు, సౌత్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

44
మలయాళ దర్శకుడితో మొదటి సారి..
Image Credit : youtube

మలయాళ దర్శకుడితో మొదటి సారి..

మలయాళంలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన సుషిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయనకు ఇది తొలి తమిళ చిత్రం కావడం విశేషం. అలాగే, దర్శకుడు జిత్తు మాధవన్‌కు కూడా ఇదే మొదటి తమిళ సినిమా. ఈ చిత్రంలో జాన్ విజయ్, ఆనంద్ రాజ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో, ఈ ఏడాది దీపావళి రేసులో అడుగుపెట్టిన తొలి తమిళ సినిమాగా 'సీన్' నిలిచింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: బిగ్ బాస్ 10 తెలుగులో ఆ కామనర్ పై సెలబ్రిటీల గ్రూప్ దాడి.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
Recommended image2
Srikanth: డిప్రెషన్‌లో హీరో శ్రీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఏమన్నాడో తెలుసా? దెబ్బకు సెట్ అయిన ఫ్యామిలీ హీరో
Recommended image3
కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
Related Stories
Recommended image1
Srikanth: డిప్రెషన్‌లో హీరో శ్రీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఏమన్నాడో తెలుసా? దెబ్బకు సెట్ అయిన ఫ్యామిలీ హీరో
Recommended image2
కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved