MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `జబర్దస్త్` షోని గుర్తు చేసుకున్న అనసూయ.. అది తనకు అక్కడ ఉంటుందని హాట్‌ యాంకర్‌ ఎమోషనల్‌ పోస్ట్..

`జబర్దస్త్` షోని గుర్తు చేసుకున్న అనసూయ.. అది తనకు అక్కడ ఉంటుందని హాట్‌ యాంకర్‌ ఎమోషనల్‌ పోస్ట్..

యాంకర్‌ అనసూయ `జబర్దస్త్` షోతో పాపులర్‌ అయ్యింది. ఆ షో కారణంగా అనేక అవకాశాలు తెచ్చుకుంది. కానీ ఇటీవల వదిలేసింది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆమె షోకి గుడ్‌బై చెప్పింది. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 05 2022, 09:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ(Anasuya) టాలీవుడ్‌లో పాపులర్‌ యాంకర్‌. సుమ, శ్రీముఖి, రష్మిలతోపాటు యాంకర్‌గా రాణిస్తుంది. అయితే క్రేజ్‌ పరంగా అనసూయ రేంజ్‌ వేరు. ఆమెకి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ మామూలు కాదు. ఆమె గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేసినా, ఏదైనా పోస్ట్ పెట్టినా అది ఇంటర్నెట్‌లో దుమ్ము దుమారం చేస్తుంది. ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంటుంది. అనసూయ అనే నటి ఉందనే విషయాన్నికూడా ఇది మెయిన్‌ స్ట్రీమ్‌ లోకి తీసుకెళ్లింది. అంతటి పాపులారిటీని `జబర్దస్త్`(Jabardasth Show) తనకి తీసుకొచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇటీవల అనసూయ(Anchor Anasuya)  `జబర్దస్త్`ని వీడింది. ఈ సందర్భంగా పలు విమర్శలు చేసింది. బాడీ షేమింగ్‌, వల్గర్‌ కామెంట్లు, నిర్వాహణ హౌజ్‌పై కూడా ఆమె విమర్శలు చేస్తూ బయటకొచ్చింది. ఆ షో స్థానంలో `సూపర్‌ సింగర్‌ జూనియర్‌`కి యాంకర్‌గా చేసింది. ఇది ఇప్పటికే అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క షో కూడా లేదు. కానీ సినిమాలతో బిజీగా ఉంది. అయితే షూటింగ్‌లు లేకపోతే ఖాళీనే. ఫ్రీగా ఉన్న కారణంగా అనసూయ సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. 
 

37

అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పింది అనసూయ. టీవీ షోస్‌లో ఎప్పుడు కనిపిస్తారన్న ప్రశ్నకి, ఇప్పుడు టీవీకి బ్రేక్‌ తీసుకున్నా అని, ఏదైనా ఎగ్జైటింగ్‌ షో వచ్చేంత వరకు ఇంతే అని వెల్లడించింది. ఈ సందర్భంగా `జబర్దస్త్` గురించి ప్రశ్నించాడో నెటిజన్లు. ఈ సమయంలో `జబర్దస్త్`ని మిస్‌ అవుతున్నారా? అన్ని అడగ్గా, దానికి అనసూయ రియాక్ట్ అవుతూ దానిపై పాజిటివ్‌గా స్పందించింది. 
 

47

`అప్‌కోర్స్(జబర్దస్త్ ని మిస్‌ అవుతున్నా), ఆ షోకి తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కడ మీరు ఉండాలనుకుంటారో, అక్కడ ఉండ కూడదు. ఆ సమయంలో కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది` అని పేర్కొంది. `జబర్దస్త్` షో మానేయడంలో తాను కష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇంకో మంచి స్థానంలో ఉండాలంటే ఇక్కడ ఉండ కూడదనే అర్థంలో ఆమె ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. 
 

57

అనసూయ ప్రతి వారం `జబర్దస్త్` షో కోసం ఫోటో షూట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్‌ పోజులిస్తూ అందాల ఆరబోస్తూ ఆమె దిగే ఫోటోలు అభిమానులను, నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటూ విజువల్‌ ట్రీట్‌నిస్తుంటారు. అందాలకు సంబంధించిన విందు భోజనం పెడుతుంటారు. ఈక్రమంలో ఆమె ఫోటోలు కొన్నిసార్లు ట్రోల్స్ గురవుతుంటాయి. డ్రెస్‌పై విమర్శలు వస్తుంటాయి. వీటన్నింటికి ఘాటుగా రియాక్ట్ అవుతూ వారి నోళ్లు మూయిస్తుంటుంది. కానీ ఏదో రూపంలో తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. 

67

అయితే `జబర్దస్త్` మానేయడంతో ఆమె గ్లామర్‌ ఫోటోలు లేవు. ఇంట్లో దిగిన సెల్ఫీ ఫోటోలు అడపాదడపా తప్ప ఆమె గ్లామర్‌ మిస్‌ అవుతుంది. అదే బాధని నెటిజన్లు వ్యక్తంచేస్తున్నారు. మా గ్లామర్‌ ఫోటో షూట్‌ మిస్‌ అవుతున్నామని అడగ్గా, `అయ్యో.. త్వరలోనే ప్లాన్‌` చేస్తానని తెలిపింది అనసూయ. గ్లామర్‌ షో చేస్తూ చిలిపిగా కుర్రాళ్లని గెలికే అనసూయ ఇప్పుడు సైలైంట్‌ కావడంతో ఏదో మిస్‌ అయిన ఫీలింగ్‌లో ఉండిపోతున్నారు ఆమె అభిమానులు. మరి వారి కోరికని నెరవేరుస్తుందా? చూడాలి. 
 

77

ఇదిలా ఉంటే అనసూయ `జబర్దస్త్`ని వీడిన అనంతరం రష్మి ఆ స్థానంలో యాంకర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్లపాటు రష్మినే చూసుకున్నారు. ఇటీవల కొత్త యాంకర్‌ సౌమ్య రావుని తీసుకొచ్చింది. కన్నడ భామ అయిన సౌమ్య రావు, సీరియల్‌ నటిగా, యాంకర్‌గా రాణిస్తున్నారు. ఆ మధ్య ఈటీవీ ప్రోగ్రామ్‌లో పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు `జబర్దస్త్`కి యాంకర్‌గా ఛాన్స్ కొట్టారు. సౌమ్య రావు వచ్చాక షోకి ఆదరణ మరింతగా పెరిగిందని టాక్. ఆమెని చూసేందుకు, ఆమె మాటలు వినేందుకు ఆడియెన్స్ ఈ కామెడీ షోని చూస్తున్నారు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved