- Home
- Entertainment
- ఫారిన్ లో అనసూయ జల్సాలు... వైన్ తాగుతూ ఫ్రెండ్స్ తో పార్టీలు, ఫోటోలు వీడియోలు వైరల్!
ఫారిన్ లో అనసూయ జల్సాలు... వైన్ తాగుతూ ఫ్రెండ్స్ తో పార్టీలు, ఫోటోలు వీడియోలు వైరల్!
ఉన్నది ఒక్కటే జిందగీ అంటుంది అనసూయ. ఒక ప్రక్క తీరిక లేకుండా శ్రమిస్తోంది. ఖాళీ సమయం దొరికితే విహారాలకు చెక్కేస్తోంది. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న అనసూయ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది.

Anasuya Bharadwaj
విదేశాల్లో విహరిస్తుంది స్టార్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్ లో ఉన్నారు. అక్కడి తన విహారానికి సంబంధించిన ఫోటోలు ఆమె షేర్ చేశారు. సియాటిల్ నగరంలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు.
Anasuya Bharadwaj
వైన్ తాగుతూ డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో కూడా జోడించారు. అనసూయ జల్సాలు చూసి లైఫ్ అంటే ఇది కదా అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక టైట్ జీన్స్ లో అనసూయ లుక్స్ సూపర్ స్టైలిష్ గా ఉంది.
Anasuya Bharadwaj
చెప్పాలంటే అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. ఇటీవల విడుదలైన విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విమానం మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం. బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించారు. విమానం జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో విమానం చిత్రానికి భారీ రెస్పాన్స్ వస్తున్నట్లు సమాచారం.
Anasuya Bharadwaj
పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణి గా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది.
Anasuya Bharadwaj
అనసూయ ఒక్కో కాల్షీట్ కి ఐదు లక్షల రూపాయలకు పైనే తీసుకుంటున్నారట. యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు. అనసూయ యాంకరింగ్ మానేయడానికి ఇది కూడా కారణం.
Anasuya Bharadwaj
మరోవైపు అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద విరక్తి పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఖరాకండిగా చెప్పింది.
Anasuya Bharadwaj
అనసూయకు ఫేమ్ కి జబర్దస్త్ షోనే కారణం. జబర్దస్త్ షో ఆమెను షో స్టార్ ని చేసింది. ఇప్పుడు అనుభవిస్తున్న స్టార్డమ్ మొత్తం జబర్దస్త్ పుణ్యమే. జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక అనసూయ ఆరోపణలు చేయడం కొసమెరుపు. కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఆమె అన్నారు.
Anasuya Bharadwaj
ఉన్నది ఒక్కటే జిందగీ అంటుంది అనసూయ. ఒక ప్రక్క తీరిక లేకుండా శ్రమిస్తోంది. ఖాళీ సమయం దొరికితే విహారాలకు చెక్కేస్తోంది. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న అనసూయ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది.