MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Aishwarya Rajesh: చిన్నప్పుడే తండ్రి, తర్వాత అన్నయ్యల మరణం... ఐశ్వర్య రాజేష్ జీవితమంతా కష్టాలు మయం 

Aishwarya Rajesh: చిన్నప్పుడే తండ్రి, తర్వాత అన్నయ్యల మరణం... ఐశ్వర్య రాజేష్ జీవితమంతా కష్టాలు మయం 

జీవితంలో కొందరు పడ్డ కష్టాలు చూస్తే కష్టాలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాయి. అలాంటి అత్యంత దారుణమైన పరిస్థితులు, కష్టాలు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఎదుర్కొన్నారు. టాలెంటెడ్ హీరోయిన్ గా సౌత్ లో నిలదొక్కుకుని ఐశ్వర్య బాల్యం నుండి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 18 2022, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పలు సందర్భాల్లో ఐశ్వర్య తనకు జీవితంలో ఎదురైన ఇబ్బందులు గుర్తు చేసుకున్నారు. ఐశ్వర్య రాజేష్ సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి రాజేష్ 80లలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. హీరోగా, సెకండ్ హీరోగా, విలన్ రోల్స్ చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలాగే లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి స్వయానా మేనత్త. దీంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐశ్వర్య కెరీర్ మొదలైంది. అయితే 8 ఏళ్ల ప్రాయంలోనే ఐశ్వర్య తండ్రి రాజేష్ మరణించారు. తండ్రి మరణంతో కుటుంబం కృంగిపోయింది. పెద్దయ్యాక అండగా ఉంటారనుకున్న అన్నయ్యలు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

36

కుటుంబంలో వరుస మరణాలు ఉక్కిరిబిరికి చేశాయని ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. పరిశ్రమకు వచ్చాక, రాకముందు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పారు. స్టార్ హీరోయిన్ కాకపోయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చినట్లు ఐశ్వర్య తెలియజేశారు.

46

తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య కోలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేశారు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేశారు . కాక ముట్టై, కణ లాంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐశ్వర్య ఫస్ట్ మూవీ రాంబంటు. హీరోయిన్ అయ్యాక కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు. ఈ రెండు చిత్రాల్లో ఆమె రాజేంద్రప్రసాద్ తో నటించడం విశేషం. 

56

అలాగే తెలుగులో మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్,  టక్ జగదీష్, రిపబ్లిక్ చిత్రాలు చేశారు. ఈ చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. తమిళంలో మాత్రం వరుస చిత్రాలు చేస్తున్నారు.

66

ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఐదు తమిళ చిత్రాలతో పాటు ఓ మలయాళ చిత్రం తెరకెక్కుతుంది. వీటిలో విక్రమ్ హీరోగా నిర్మిస్తున్న ధ్రువ నక్షత్రం అనే భారీ చిత్రం ఉంది. ఇక నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సుడల్ వెబ్ సిరీస్ లో ఐశ్వర్య రాజేష్ నటించారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాని (నటుడు)
Latest Videos
Recommended Stories
Recommended image1
Pradeep Rawat: 36 ఏళ్ల క్రితమే మరణాన్ని జయించిన ప్రదీప్‌ రావత్‌.. సముద్రంలో పెను ప్రమాదం
Recommended image2
Kajal Aggarwal: మహేష్ బాబు వస్తాడనుకుంటే కాజల్ అగర్వాల్ కలలోకి వచ్చి భయపెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
Recommended image3
10th Class Heroine: అమ్మ రెండో పెళ్లి, 120 కేజీల బరువుపై నటి ఆవేదన.. ప్రభాస్ కోసం రోజూ ప్రార్థిస్తున్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved