- Home
- Entertainment
- యూట్యూబర్ ప్రేమలో సురేఖా వాణి కూతురు సుప్రీత?... స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే ఇలా చేసిందేంటి!
యూట్యూబర్ ప్రేమలో సురేఖా వాణి కూతురు సుప్రీత?... స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే ఇలా చేసిందేంటి!
నటి సురేఖా వాణి కూతురు సుప్రీత ప్రేమలో పడ్డారన్న వార్త సంచలనం రేపుతోంది. కొన్ని రోజులు ఈ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

Supritha
నటి సురేఖా వాణి తనయ సుప్రీతకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమెను సోషల్ మీడియా జనాలు లక్షల్లో ఫాలో అవుతున్నారు. తన అభిమానులతో టచ్ లో ఉంటూ మరింత పాపులారిటీ పెంచుకుంటూ ఉంటుంది. సుప్రీతను హీరోయిన్ చేయాలనేది సురేఖ కల. అందుకు కావాల్సిన ఏర్పాట్లలో ఉన్నారు.
Supritha
అయితే హీరోయిన్ కాకముందే సుప్రీత ప్రేమలో పడ్డారన్న వార్తలు సంచనలం రేపుతున్నాయి. సాధారణంగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమై ఓ నాలుగైదు సినిమాలు చేశాక అమ్మాయిలు ఇలాంటి పుకార్లు ఎదుర్కొంటారు. సుప్రీత అనూహ్యంగా అరంగేట్రం కాకుండానే ఎఫైర్ వార్తల్లో నిలుస్తున్నారు.
Supritha
ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహకు ఆమె మనసిచ్చారంటూ కథనాలు వెలువడుతున్నాయి. తరచుగా నిఖిల్-సుప్రీత కలిసి కనిపిస్తున్నారు. చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఈ క్రమంలో రూమర్స్ తెరపైకి వచ్చాయి. నిఖిల్ తో సంథింగ్ సంథింగ్ పుకార్లు వినిపిస్తున్నప్పటికీ సన్నిహితంగా ఉండటం మానలేదు. ఇద్దరూ కలిసి రొమాంటిక్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
Supritha
అలాగే తమ బంధం ఏమిటో క్లారిటీ ఇవ్వలేదు. సాధారణంగా తమపై వచ్చే వార్తలకు సుప్రీత స్పందిస్తారు. ఆ మధ్య తల్లి సురేఖా వాణి రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. సుప్రీత ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సురేఖా పెళ్లి వార్తలను ఖండించారు. నిఖిల్ ని ప్రేమిస్తుందంటూ ఇంత పెద్ద చర్చ నడుస్తున్నా... సుప్రీత స్పందించకపోవడం విశేషం.
మరోవైపు సిల్వర్ స్క్రీన్ పై సురేఖా వాణి జోరు తగ్గింది. ఆమెకు పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. ఒకప్పుడు ప్రతి మూవీలో సురేఖా వాణి ఉండేవారు. అలాంటిది సిల్వర్ స్క్రీన్ పై కనిపించడమే అరుదై పోయింది. ఆ మధ్య ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సురేఖా వాణి పరిశ్రమ మీద అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ నన్ను పక్కన పెట్టేసింది. సురేఖా వాణి సినిమాల్లో కనిపించడం లేదని పలువురు అంటున్నారు. ఆఫర్స్ వస్తే ఎందుకు నటించడం... అని సురేఖా అన్నారు.
అయితే సురేఖా వాణి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సురేఖా వాణికే పెళ్లీడుకు వచ్చిన కూతురు వుంది. తనతో హాట్ డాన్స్ వీడియోలు, ఫోటో షూట్స్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. సురేఖా, సుప్రీతలకు ఇంస్టాగ్రామ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ తల్లీ కూతుళ్లు ఫ్రెండ్స్ కి మించి సన్నిహితంగా ఉంటారు.