MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేసిన హీరోయిన్.. రష్మీ ఓదార్చుతున్నా గుండె బద్దలయ్యేలా ఏడుస్తూ.. 

తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేసిన హీరోయిన్.. రష్మీ ఓదార్చుతున్నా గుండె బద్దలయ్యేలా ఏడుస్తూ.. 

మే 12న మదర్స్ డే కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ అని ఆ విధంగా రూపొందించారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదలయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 05 2024, 10:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కట్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్వులు పూయిస్తున్నారు. లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సరికొత్తగా ముస్తాబవుతోంది. 

26

మే 12న మదర్స్ డే కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ అని ఆ విధంగా రూపొందించారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమో సరదాగా ఉంటూనే ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంది. 

 

36

ఫైమా, అంజలి లాంటి వారంతా వారి తల్లులతో శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజరయ్యారు. ఇక గెటప్ శ్రీను తాను నటిస్తున్న రాజు యాదవ్ చిత్ర ప్రమోషన్స్ కి హాజరయ్యాడు. రష్మీ ఈ షోలో మమ్మి వర్సెస్ డాటర్స్ అనే గేమ్ నిర్వహించింది. ఈ గేమ్ సరదాగా సాగింది. 

46

మదర్స్ డే సందర్భంగా బులెట్ భాస్కర్, ఇమ్మాన్యూల్, నూకరాజు, పొట్టి నరేష్ లాంటి జబర్దస్త్ కమెడియన్లంతా తాము అమ్మగా భావించే ఇంద్రజ ని సన్మానించారు. ఇంద్రజకి ఒక్కొక్కరు ఒక్కో గిఫ్ట్ ఇచ్చారు. నూకరాజు ఆమెకి మంచి చీరని బహూకరించాడు. 

56

వారందరి ప్రేమకి ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు. అయితే మదర్స్ డే కావడంతో ఇంద్రజ కూడా తన తల్లిని గుర్తు చేసుకున్నారు. మన జీవితంలో ఎన్ని రిలేషన్స్ ఉన్నా సరే తల్లి తండ్రి లేకుంటే అనాధల లెక్కే అని ఇంద్రజ తెలిపింది. కన్న తల్లి దండ్రులకు చేయకుండా ఊరంతా వెళ్లి చేసి ప్రయోజనం లేదు. తాను కూడా ఆ విధంగా చాలా తప్పులు చేసినట్లు ఇంద్రజ బాధపడింది. 

66

తన తల్లి చివరి కోరిక నెరవేర్చలేకపోయానని ఇంద్రజ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. రష్మీ గౌతమ్ వచ్చి ఓదార్చుతున్నప్పటికీ ఇంద్రజ గుండె బద్దలయ్యేలా ఏడ్చారు. ఆమె బాధ చూసి అక్కడున్నవారంతా కంటతడి పెట్టుకున్నారు. మా అమ్మ ఉన్నప్పుడు ఓ గుడికి తీసుకెళ్లమని చాలా సార్లు అడిగింది. ఆమె కోరిక తీర్చలేకపోయాను. ఒక్కసారి మా అమ్మ కనిపిస్తే ఆమె కోరిక నెరవేర్చాలని ఉంది అంటూ ఇంద్రజ భరించలేని భావోద్వేగానికి గురయ్యారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న
Recommended image3
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved