MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • అభినయశ్రీ ఎలిమినేటెడ్.. హౌస్ లో అతడొక్కడే కన్నింగ్ మెంటాలిటీ అంటూ నిందలు

అభినయశ్రీ ఎలిమినేటెడ్.. హౌస్ లో అతడొక్కడే కన్నింగ్ మెంటాలిటీ అంటూ నిందలు

నిన్న శనివారం బిగ్ బాస్ 6 నుంచి షాని సల్మాన్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. దీనితో ఎలిమినేట్ కాబోయే మరో కంటెస్టెంట్ ఎవరు అనే ఉత్కంఠతో సండే ఎపిసోడ్ మొదలయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 18 2022, 10:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నిన్న శనివారం బిగ్ బాస్ 6 నుంచి షాని సల్మాన్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. దీనితో ఎలిమినేట్ కాబోయే మరో కంటెస్టెంట్ ఎవరు అనే ఉత్కంఠతో సండే ఎపిసోడ్ మొదలయింది. శనివారం సీరియస్ గా ఎంట్రీ ఇచ్చిన నాగ్.. సండే రోజు ఫుల్ జోష్ తో సరదాగా వచ్చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నాగ్ రాగానే మిల్కీ బ్యూటీ తమన్నాని వెదకిపైకి ఆహ్వానించి సర్ప్రైజ్ ఇచ్చారు. తమన్నాని చూడగానే హౌస్ మేట్స్, ఆడియన్స్ కేరింతలు కొట్టారు. తమన్నా తాను నటిస్తున్న బబ్లీ బౌన్సర్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో మెరిసింది. వేదికపై బబ్లీ బౌన్సర్ ట్రైలర్ ప్రదర్శించారు. తమన్నా ట్రాన్స్ఫర్మేషన్ ని నాగార్జున అభినందించారు. ఇక ఇంటి సభ్యులతో చిన్న గేమ్ అందించేందుకు నాగ్ తమన్నాని హౌస్ లోపలి పంపారు. 

37

అబ్బాయిలు తమకి రక్షణగా ఉండే లేడీ బౌన్సర్ ని ఎంచుకోవాలి. ఆది గీతూని.. బాలాదిత్య గీతూని , అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్యని ఇలా ప్రతి ఒక్క అబ్బాయి ఒక లేడీ బౌన్సర్ ని ఎంచుకున్నారు. ఎక్కువ మంది గీతూని ఎంచుకున్నారు. ఇక తమన్నా అబ్బాయిల్లో నుంచి రోహిత్, రేవంత్, అర్జున్, సూర్యని ఎంచుకుంది. ఈ నలుగురు తమన్నాని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించారు. సూర్య తన మిమిక్రితో మిల్కీ బ్యూటీని ఇంప్రెస్ చేశాడు. హౌస్ మేట్స్ అందరిని తమన్నా అభినందించి హౌస్ ని వీడింది. 

47

ఇక నాగార్జున ఎలిమినేషన్స్ ప్రక్రియ ప్రారంభించారు. హౌస్ మేట్స్ చేత గజిబిజి గానా అనే గేమ్ ఆడిస్తూ మధ్యలో నామినేషన్స్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. గజిబిజి గానాలో భామగా స్రీన్ పై పదాలు గజిబిజిగా కనిపిస్తాయి. వాటి ఆధారంగా ఆ పాట ఏంటో చెప్పాలి. హౌస్ మేట్స్ రేవంత్ టీం, చంటి టీంగా విడిపోయారు. చివరికి గేమ్ లో రేవంత్ టీం విజయం సాధించింది. 

57

నామినేషన్స్ లో ఆది రెడ్డి, మెరీనా-రోహిత్, ఫైమా, గీతూ, అభినయ, రాజ్, రేవంత్ ఉన్నారు. మొదటగా వీరిలో గీతూ, రాజ్ సేఫ్ అయ్యారు. మిగిలిన వారిలో మరో రౌండ్ లో రేవంత్ సేఫ్ అయ్యాడు. మరో రౌండ్ లో మెరీనా రోహిత్ సేఫ్ కాగా చివరికి నామినేషన్స్ లో ఆది రెడ్డి, అభినయ మిగిలారు. 

67

నాగార్జున ద్రవ పదార్థాలు కలిగిన రెండు గాజు గ్లాసులు తీసుకున్నారు. ఒకదానికి అభినయ ఫోటో, మరో గాజు గ్లాసుకి ఆది రెడ్డి ఫోటో ఉంది. వాటిలోకి నాగార్జున మరో ద్రవపదార్థం కలపగా అభినయ గాజు గ్లాసు రెడ్ కలర్ లోకి మారింది. సో అభినయ శ్రీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆది రెడ్డి సేఫ్ అయ్యారు. హౌస్ మేట్స్ అభినయకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. నాగార్జున అభినయని వేదికపైకి పిలిచి హౌస్ లో ఆమె జర్నీ చూపించారు. 

77

ఇక హౌస్ లో హానెస్ట్ ఎవరు..హానెస్ట్ కానిది ఎవరు అని అడగగా అభినయ ఐదుగురిని ఎంచుకుంది. ఫైమా, చంటి, బాలాదిత్య, శ్రీసత్య, సూర్య లని హానెస్ట్ అని పేర్కొంది. హౌస్ లో రేవంత్ మాత్రమే కన్నింగ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అభినయ. లోపల ఉన్నప్పుడు రేవంత్ కి ఈ విషయం చెప్పాను అని అభినయ పేర్కొంది.  మిగిలిన వారంతా వారి స్ట్రాటజిలతో గేమ్ బాగా ఆడుతున్నారు అని పేర్కొంది.  అనంతరం అభినయ చిన్నపాటి ఎమోషన్ కి గురై బిగ్ బాస్ ని వీడింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved