MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • దంచుడే.. దంచుడు.. 30 బంతుల్లోనే సెంచ‌రీతో అభిషేక్ శర్మ విధ్వంసం

దంచుడే.. దంచుడు.. 30 బంతుల్లోనే సెంచ‌రీతో అభిషేక్ శర్మ విధ్వంసం

IND vs AFG 3rd T20: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్‌తో మైదానంలో పరుగుల వరద పారించాడు. అఫ్గనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 17 2026, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
16 బంతుల్లోనే అర్ధ శతకం.. ఆరంభం నుంచే దూకుడు
Image Credit : BCCI/X

16 బంతుల్లోనే అర్ధ శతకం.. ఆరంభం నుంచే దూకుడు

అఫ్గనిస్థాన్‌తో మూడో టీ20లో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా బౌండరీలు బాదాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తనదైన దూకుడుతో బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
30 బంతుల్లో సెంచరీ.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు
Image Credit : BCCI

30 బంతుల్లో సెంచరీ.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు

అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను సెంచరీ వరకు కొనసాగించాడు. కేవలం 30 బంతుల్లోనే 100 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో 2017లో 35 బంతుల్లో శతకం సాధించిన రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ బౌండరీలతో పాటు భారీ సిక్సర్లతోనూ అలరించాడు. 9 ఫోర్లు, 10 సిక్సర్లతో అఫ్గనిస్థాన్ బౌలింగ్‌పై విరుచుకుపడ్డాడు. అతడి దూకుడు కారణంగా భారత జట్టు తక్కువ సమయంలోనే భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది.

33
పవర్‌ప్లేలోనే 100 పరుగులు.. టీమిండియా రికార్డు
Image Credit : BCCI/X

పవర్‌ప్లేలోనే 100 పరుగులు.. టీమిండియా రికార్డు

అభిషేక్ శర్మతో పాటు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా వేగంగా పరుగులు సాధించాడు. వీరిద్దరూ అఫ్గనిస్థాన్ బౌలర్లను ఎదుర్కొంటూ భారీ షాట్లు ఆడటంతో భారత జట్టు పవర్‌ప్లే ముగిసే సమయానికే వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసింది. టీ20ల్లో భారత్‌కు ఇది అత్యధిక పవర్‌ప్లే స్కోరుగా నిలిచింది. అభిషేక్ దూకుడుకు సంజూ శాంసన్ ఆట కూడా తోడవడంతో పరుగుల వేగం మరింత పెరిగింది. తొలి ఆరు ఓవర్లలోనే స్కోరు వంద దాటడంతో అఫ్గనిస్థాన్ బౌలర్లపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ఆ తర్వాత కూడా భారత ఓపెనర్లు అదే దూకుడును కొనసాగించారు.

Rollicking 1⃣6⃣-ball FIFTY 🔥

Abhishek Sharma's 1⃣3⃣th in T20Is 👏

50-run partnership also up for the openers 🤝

Updates ▶️ https://t.co/Zixki4RhPt#TeamIndia | #AFGvIND pic.twitter.com/qXQYnnCl3K

— BCCI (@BCCI) September 17, 2026

సంజూ శాంసన్ ధనాధన్ ఆట.. భారీ స్కోరు దిశగా భారత్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రుగుతోన్న‌ ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్ కూడా ఆకట్టుకున్నాడు. వేగంగా పరుగులు సాధిస్తూ టీ20 క్రికెట్‌లో 9,000 పరుగుల క్లబ్‌లో చోటు సంపాదించాడు. ఇద్దరు ఓపెనర్లు కలిసి అఫ్గనిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడటంతో భారత ఇన్నింగ్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
ఎంత బ‌ల‌వంతుడివైనా స‌రే కోపం జీవితాన్ని నాశ‌నం చేయ‌డం ఖాయం.. క‌నువిప్పు క‌లిగించే క‌థ
Recommended image2
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved