MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Today Gold Rate: మిడిల్ ఈస్ట్ లో భగ్గుమన్న యుద్ధ సెగలు....కానీ ఈసారి బంగారం ధరలు యూటర్న్

Today Gold Rate: మిడిల్ ఈస్ట్ లో భగ్గుమన్న యుద్ధ సెగలు....కానీ ఈసారి బంగారం ధరలు యూటర్న్

Today Gold Rate: పసిడి ప్రియులకు ఈ రోజు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. గత కొన్ని రోజులుగా వరుసగా ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

1 Min read
Author : Nandini Arava
Published : Jul 29 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి
Image Credit : iSTOCK

మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి

అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్)కు మొగ్గు చూపడంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలపై ఒత్తిడి ఏర్పడింది. అలాగే అమెరికా డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్ల యీల్డ్స్ పెరగడం కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.660 తగ్గి రూ.1,43,510 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,31,550కు చేరుకుంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.1,07,630గా నమోదైంది. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారికి కొంత ఉపశమనం లభించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మిడిల్ ఈస్ట్ లో భగ్గుమన్న యుద్ధ సెగలు
Image Credit : iSTOCK

మిడిల్ ఈస్ట్ లో భగ్గుమన్న యుద్ధ సెగలు

అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్‌ను మళ్లీ అప్రమత్తం చేస్తున్నాయి. ఐదు రోజుల విరామం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగినట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్, అమెరికా అనుబంధ బలగాల మధ్య దాడులు జరిగినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అలాగే హూర్మూజ్ జలసంధిలో ట్యాంకర్ల కదలికలపై ఆంక్షలు విధించారనే సమాచారం కూడా ఆందోళన పెంచుతోంది.

Related Articles

Related image1
Today Gold Rate: బంగారం ధరలకు బ్రేక్.. ఈరోజు ఎంత తగ్గిందో తెలుసా?
Related image2
Gold Price Hike: అమెరికా-ఇరాన్ యుద్ధం శాంతించినా...ఏమాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు
33
సురక్షిత పెట్టుబడిగా బంగారం
Image Credit : iSTOCK

సురక్షిత పెట్టుబడిగా బంగారం

సాధారణంగా యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. దీంతో బంగారంపై డిమాండ్ పెరిగి ధరలు మళ్లీ ఎగబాకే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుత తగ్గుదల తాత్కాలికమే కావచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ పరిస్థితులు, అమెరికా ఆర్థిక సూచికలు బంగారం ధరల దిశను నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Today Gold Rate: బంగారం ధరలకు బ్రేక్.. ఈరోజు ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image2
Gold Price Hike: అమెరికా-ఇరాన్ యుద్ధం శాంతించినా...ఏమాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved