MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate: బంగారం ధరలకు బ్రేక్.. ఈరోజు ఎంత తగ్గిందో తెలుసా?

Today Gold Rate: బంగారం ధరలకు బ్రేక్.. ఈరోజు ఎంత తగ్గిందో తెలుసా?

Today Gold Rate: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈరోజు మార్కెట్ నుంచి ఊరట కలిగించే వార్త వచ్చింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న పసిడి ధరలు ఈరోజు భారీగా దిగొచ్చాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 28 2026, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీగా దిగొచ్చిన పసిడి, వెడి
Image Credit : chatgpt

భారీగా దిగొచ్చిన పసిడి, వెడి

బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఆర్థిక విధానాలు, చమురు ధరల్లో వచ్చిన మార్పులు, డాలర్ బలహీనత... ఇలా ఎన్నో అంశాలు కలిసి ఈ తగ్గుదలకు కారణమయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,44,170గా కొనసాగుతున్న పసిడి
Image Credit : iSTOCK

రూ.1,44,170గా కొనసాగుతున్న పసిడి

హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,170గా నమోదైంది. అంటే ఒక్కరోజులోనే రూ.1,690 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,32,150గా ఉంది. ఇది నిన్నటితో పోలిస్తే రూ.1,550 తగ్గింది. వెండి ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది.

Related Articles

Related image1
Gold Price Hike: అమెరికా-ఇరాన్ యుద్ధం శాంతించినా...ఏమాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు
Related image2
Gold Price Hike: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో రెండో రోజు బంగారం ధరలకు బ్రేక్
34
కాస్త సద్దుమణిగిన యుద్ధ పరిస్థితులు
Image Credit : iSTOCK

కాస్త సద్దుమణిగిన యుద్ధ పరిస్థితులు

కొన్ని రోజులుగా ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రస్తుతం కొంత సద్దుమణిగాయి. రెండు దేశాలు తక్షణ దాడులకు దూరంగా ఉండటంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు తగ్గాయి. దీని వల్ల హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం మార్గాల్లో సరుకు రవాణా అంతరాయం ఏర్పడుతుందనే భయాలు తగ్గిపోయాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఈ మార్గాలకు చాలా ప్రాధాన్యం ఉంది. యుద్ధ భయాలు తగ్గడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 5 శాతానికి పైగా పడిపోయాయి. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం తగ్గితే ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మరింత పెంచాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది మొత్తం ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒక పాజిటివ్ సిగ్నల్‌గా మారింది.

44
ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి
Image Credit : Asianet News

ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి

మరోవైపు అమెరికా ప్రభుత్వం పలు దేశాల దిగుమతులపై కొత్త సుంకాలను విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీంతో ప్రపంచ వాణిజ్యంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. అంటే...ఒకవైపు యుద్ధ భయాలు తగ్గుతుండగా...మరోవైపు వాణిజ్య ఉద్రిక్తతలు పూర్తిగా ముగియలేదు.అందుకే బంగారం ధరల్లో ఇంకా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ల దృష్టి మొత్తం అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంపైనే ఉంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లలో పెద్ద మార్పు ఉండకపోవచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది. కానీ అసలు మార్కెట్‌ను కదిలించేది వడ్డీ రేటు మాత్రమే కాదు. ఫెడ్ భవిష్యత్‌పై ఇచ్చే సంకేతాలు కూడా చాలా కీలకం. కొన్ని వారాలుగా పడిపోతున్న బంగారం ధరలు ప్రస్తుతం కొంత స్థిరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: అమెరికా-ఇరాన్ యుద్ధం శాంతించినా...ఏమాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు
Recommended image2
Gold Rate: అమెరికాలో బిగ్ మీటింగ్.. గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? బంగారం రేట్లు ఏమవుతాయంటే !
Recommended image3
Post office: నెల‌కు రూ. 12 వేలు ప‌క్క‌న పెడితే రూ. 43 ల‌క్ష‌లు జ‌మ చేయొచ్చు.. జ‌స్ట్ 15 ఏళ్ల‌లోనే
Related Stories
Recommended image1
Gold Price Hike: అమెరికా-ఇరాన్ యుద్ధం శాంతించినా...ఏమాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు
Recommended image2
Gold Price Hike: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో రెండో రోజు బంగారం ధరలకు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved