MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?

సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?

సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారా? కేవలం రేటు చూసి డిసైడ్ అవ్వొద్దు. ఏ మోడల్ తీసుకోవాలి, ఎక్కడ కొనాలి, కారు కండిషన్ ఎలా ఉంది, పేపర్స్ అన్నీ పక్కాగా ఉన్నాయా లేదా వంటివి ఎన్నో చెక్ చేయాలి.

3 Min read
Author : Haritha Chappa
Published : Sep 21 2026, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?
Image Credit : Asianet News

సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?

సెకండ్ హ్యాండ్ కార్ తక్కువ ధరకే వస్తుంది. అందుకే ఎంతో మంది మధ్యతరగతి వారు పాత కారు కొనేందుకు ఇష్టపడతారు. చాలామంది ముందుగా చూసేది కారు రేటు. తరువాత కారు బయట నుంచి ఎలా ఉందో చూస్తారు. కానీ నిజానికి చూడాల్సినవి చాలా ఉన్నాయి.

సెకండ్ హ్యాండ్ కారు కొన్నాక కొన్ని ఖర్చులు ఉంటాయి. ఓనర్ షిప్ మార్చడం, ఇన్సూరెన్స్ రెన్యూవల్, సర్వీసింగ్, టైర్లు, బ్యాటరీ లాంటి ఖర్చులు కూడా రావచ్చు. ఒక కారు మీ బడ్జెట్ లో ఉందని చెప్పి, మొత్తం డబ్బులు కారుకే పెట్టేయకండి. కొన్నాక అనుకోకుండా ఏవైనా రిపేర్లు వస్తే తట్టుకోవడానికి కొంత అమౌంట్ పక్కన పెట్టుకోవడం మంచిది.

అలాగే, కారు ఎన్ని ఏళ్లు పాతది అనే దాన్ని బట్టి మాత్రమే డిసైడ్ అవ్వొద్దు. ఓడోమీటర్ లో ఉన్న కిలోమీటర్ల సంఖ్యతో పాటు సర్వీస్ హిస్టరీ, ఎంతమంది ఓనర్లు మారారు, యాక్సిడెంట్ హిస్టరీ, మెయింటెనెన్స్ లాంటివి కూడా కలిపి చూడాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎక్కడ కొనాలి? ఓనర్ దగ్గరా, డీలర్ దగ్గరా?
Image Credit : Gemini

ఎక్కడ కొనాలి? ఓనర్ దగ్గరా, డీలర్ దగ్గరా?

సెకండ్ హ్యాండ్ కార్ కొనడానికి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ గా ఓనర్ దగ్గర కొంటే బ్రోకర్ ఖర్చు తగ్గుతుంది. కానీ కారు అసలు కండిషన్ ని మీకు తెలిసిన నమ్మకమైన మెకానిక్ తో చెక్ చేయించుకోవాలి. లోకల్ యూజ్డ్ కార్ డీలర్ దగ్గర కొంటే ఒకేచోట చాలా కార్లు చూడొచ్చు. కానీ డీలర్ చెప్పేది మాత్రమే నమ్మకుండా, సొంతంగా చెక్ చేసుకోవడం ముఖ్యం.

మరో దారి కంపెనీల సర్టిఫైడ్ యూజ్డ్ కార్ ప్రోగ్రామ్స్. ఉదాహరణకు మారుతి సుజుకి ట్రూవాల్యూ, హ్యుందాయ్ ప్రామిస్, టయోటా యూ ట్రస్ట్ లాంటివి వాడిన కార్లను చెక్ చేసి సర్టిఫికెట్, కొన్ని వారంటీలు ఇస్తాయి. హ్యుందాయ్ ప్రామిస్ తమ కార్లకు 161 పాయింట్ల చెకప్, టయోటా యూ ట్రస్ట్ 203 పాయింట్ల చెకప్ ఇస్తున్నట్లు చెబుతున్నాయి. సర్టిఫికెట్ ఉందని గుడ్డిగా కొనొద్దు. సర్టిఫికెట్ అనేది ఒక అదనపు భద్రత మాత్రమే. అయినా సరే సొంత మెకానిక్ తో కారును చెక్ చేయించడం మంచి పద్ధతి.

34
ఏ సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి?
Image Credit : our own

ఏ సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి?

సెకండ్ హ్యాండ్ లో ఏ కారు బెస్ట్? అనే దానికి సమాధానం ఉండదు. మీ వాడుక, బడ్జెట్, ఫ్యామిలీ సైజ్, సిటీ లేదా హైవే ప్రయాణం, మెయింటెనెన్స్ ఖర్చులను బట్టి మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

మారుతి సుజుకి స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 లాంటి చిన్న కార్లు సిటీ వాడకానికి పాపులర్ ఛాయిస్. 2026 కార్స్24 యూజ్డ్ కార్ సేల్స్ డేటాలో స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎక్కువగా అమ్ముడైన మోడల్స్ లో ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ20, మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, హోండా అమేజ్ లాంటి కార్లు చూడొచ్చు. ఎక్కువ స్పేస్, లాంగ్ జర్నీ కంఫర్ట్ ముఖ్యం అనుకుంటే, కారు ఇయర్, ఇంజిన్, మెయింటెనెన్స్ హిస్టరీ చూసి డిసైడ్ అవ్వాలి. బాలెనో, గ్లాంజా యూజ్డ్ కార్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న మోడల్స్. 2026 ఆటోకార్-స్పిన్నీ స్టడీలో, మిడ్ సైజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో బాలెనో, గ్లాంజా మంచి రీసేల్ వాల్యూ కలిగి ఉన్నాయని తేలింది.

టయోటా ఇన్నోవా/ఇన్నోవా క్రిస్టా లాంటి మోడల్స్ పెద్ద ఫ్యామిలీలకు సెట్ అవుతాయి. కానీ ఇక్కడ కారు వయసు, తిరిగిన కిలోమీటర్లు, డీజిల్ ఇంజిన్ కండిషన్, క్లచ్, సస్పెన్షన్, ఇంతకుముందు ఎలా వాడారు అనేవి ఇంకా జాగ్రత్తగా చెక్ చేయాలి. ముఖ్యంగా, ఒక మోడల్ పాపులర్ అని చెప్పి ఆ మోడల్ లో ఏ సెకండ్ హ్యాండ్ కారు పడితే అది కొనొచ్చని కాదు. కారు కండిషన్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్.

44
ఈ పేపర్స్ లేకుండా డబ్బులు ఇవ్వొద్దు!
Image Credit : our own

ఈ పేపర్స్ లేకుండా డబ్బులు ఇవ్వొద్దు!

కారు ఎంత బాగున్నా పేపర్స్ లో ప్రాబ్లమ్ ఉంటే కొనకపోవడమే మంచిది. ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీ సర్టిఫికెట్, ఓనర్ డీటెయిల్స్ చెక్ చేయాలి. పరివాహన్ సేవలో వెహికల్ డీటెయిల్స్, ఇన్సూరెన్స్, పీయూసీ స్టేటస్, పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు లాంటివి చెక్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి.

లోన్ ఉందా? హైపోథెకేషన్ రికార్డ్ చూడండి!

ఆర్సీలో వెహికల్ లోన్ కి సంబంధించిన హైపోథెకేషన్ రికార్డ్ ఉంటే, పాత లోన్ పూర్తిగా క్లియర్ చేసి ఆ రికార్డ్ తీసేశారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓనర్ షిప్ మార్చడానికి పరివాహన్ గైడ్ లైన్స్ లో ఫామ్ 29, ఫామ్ 30, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ లాంటి డాక్యుమెంట్స్ అడుగుతారు.

అలాగే పెండింగ్ చలాన్లు, ఇన్సూరెన్స్ వాలిడిటీ, సర్వీస్ రికార్డ్స్ కూడా చెక్ చేయండి. డబ్బులు ఇచ్చే ముందు: అమ్మేవాడి పేరు, ఆర్సీ, వెహికల్ నంబర్, ఛాసిస్ డీటెయిల్స్ అన్నీ ఒకదానికొకటి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio: భూమి నుంచి అంతరిక్షం వరకు.. 1,600 శాటిలైట్లతో జియో మ‌రో సంచ‌ల‌నం
Recommended image2
Stock market: ఒక్క రోజులో రూ. 10 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి.. స్టాక్ మార్కెట్‌లో ఎందుకీ అల‌జ‌డి
Recommended image3
Business Ideas : కేవలం రూ.10000 పెట్టుబడితో నెలకు రూ.30000 సంపాదించే.. ట్రెండింగ్ బిజినెస్‌ ఐడియాలు
Related Stories
Recommended image1
మాంసాహారాన్ని నీచు లేదా నీసు అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరెలా వచ్చింది?
Recommended image2
బిర్యానీ, పులావ్‌లలో ఉప్పు తగ్గి చప్పగా ఉన్నాయా? నిమిషంలో ఉప్పును సరిచేసే సింపుల్ ట్రిక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved