MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Miss World 2026 Joheirry Mola: వియత్నాంలో జరిగిన మిస్ వరల్డ్ 2026 పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన జోహెయిర్రీ మోలా విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో భారత్ తరఫున ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత నికితా పోర్వాల్ ప్రాతినిధ్యం వహించారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 06 2026, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డొమినికన్ రిపబ్లిక్‌కు మిస్ వరల్డ్ 2026 కిరీటం
Image Credit : Instagram/missmundodominicanaoficial

డొమినికన్ రిపబ్లిక్‌కు మిస్ వరల్డ్ 2026 కిరీటం

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిస్ వరల్డ్ 2026 కిరీటం కొత్త విన్నర్‌ను వరించింది. ఈ సారి ఈ గ్లోబల్ క్రౌన్ డొమినికన్ రిపబ్లిక్‌కు వెళ్తోంది. వియత్నాంలోని న్హా ట్రాంగ్ లో శనివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో డొమినికన్ రిపబ్లిక్ బ్యూటీ జోహెయిర్రీ మోలా డొమింగెజ్ మిస్ వరల్డ్ 2026గా విజేతగా నిలిచారు. గత ఏడాది విజేత, థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ కొత్త క్వీన్ జోహెయిర్రీ మోలాకు ఈ కిరీటాన్ని తొడిగారు.

ఈ గ్రాండ్ ఈవెంట్‌లో స్పెయిన్‌కు చెందిన ఎలిజబెత్ రేనెస్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, మలేషియాకు చెందిన తానూసియా శెట్టి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఈ 73వ మిస్ వరల్డ్ ఎడిషన్.. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ 75వ వార్షికోత్సవ వేడుకల సమయంలో జరగడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎవరీ జోహెయిర్రీ మోలా?
Image Credit : Instagram/charmviet.official

ఎవరీ జోహెయిర్రీ మోలా?

జోహెయిర్రీ మోలా కేవలం మోడల్ మాత్రమే కాదు. ఆమె ఒక ఎడ్యుకేటర్, కమ్యూనిటీ అడ్వకేట్, కమ్యూనికేటర్. యునివర్సిడాడ్ ఇబెరోఅమెరికా నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. వెనుకబడిన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందించే 'వాయిసెస్ ఆఫ్ టుమారో' అనే స్వచ్ఛంద సంస్థను ఆమె స్వయంగా స్థాపించి నడుపుతున్నారు.

ఆమె కేవలం భాషను మాత్రమే నేర్పించడం లేదు. ఇంగ్లీష్ ద్వారా లిటరేచర్, సోషల్ స్టడీస్ బోధిస్తూ పిల్లల్లో క్రిటికల్ థింకింగ్‌ను పెంచుతున్నారు. యునివిజన్ న్యూయార్క్ ఛానెల్‌లో కరస్పాండెంట్‌గా కూడా పనిచేసి డొమినికన్ సంస్కృతి, సామాజిక అంశాలను ప్రపంచానికి తెలియజెప్పారు. 'గోయా గివ్స్' అంబాసిడర్‌గా కూడా ఆమె సేవలందిస్తున్నారు.

35
జోహెయిర్రీ మోలా ను గెలిపించిన ఆ ఒక్క సమాధానం
Image Credit : Instagram/charmviet.official

జోహెయిర్రీ మోలా ను గెలిపించిన ఆ ఒక్క సమాధానం

మిస్ వరల్డ్ ఫైనల్ రౌండ్‌లో జడ్జెస్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఆన్సర్ అందరినీ ఆకట్టుకుంది. వెనుకబడిన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందించడం వల్ల వారి జీవితాలు ఎలా మారతాయో ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల పిల్లలకు అనేక అవకాశాలు లభిస్తాయని, అది వారి జీవితాంతం ఉపయోగపడే ఆయుధమని ఆమె వివరించారు.

భాష అనేది కేవలం మాట్లాడటానికి మాత్రమే కాకుండా, తమ భావాలను వ్యక్తీకరించడానికి, సమాజంలో తమ లక్ష్యాన్ని చాటడానికి ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. ఈ అద్భుతమైన సమాధానమే ఆమెకు మిస్ వరల్డ్ కిరీటాన్ని తెచ్చిపెట్టింది.

45
44 ఏళ్ల తర్వాత రెండో కిరీటం
Image Credit : Instagram/charmviet.official

44 ఏళ్ల తర్వాత రెండో కిరీటం

డొమినికన్ రిపబ్లిక్‌కు మిస్ వరల్డ్ కిరీటం రావడం ఇది రెండోసారి. మొదటిసారిగా 1982లో మరియాసేలా అల్వారెజ్ ఆ దేశం తరఫున మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. దాదాపు 44 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ జోహెయిర్రీ మోలా ఆ దేశానికి ఈ గౌరవాన్ని తీసుకొచ్చారు.

ఈసారి పోటీల్లో దాదాపు 111 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. ఆఫ్రికా, అమెరికాస్ & కరీబియన్, యూరప్, ఆసియా & ఓషియానియా అనే నాలుగు భాగాలుగా కంటెస్టెంట్లను విభజించారు. టాప్ 40, టాప్ 20, టాప్ 12, టాప్ 6 రౌండ్ల దాటి జోహెయిర్రీ మోలా విజేతగా నిలిచారు. టాప్ 6లో ఎరిట్రియా, స్పెయిన్, మలేషియా, వియత్నాం, డొమినికన్ రిపబ్లిక్, సౌత్ ఆఫ్రికా స్టార్లు నిలిచారు.

View this post on Instagram

A post shared by Miss World (@missworld)

55
భారత్ నికితా పోర్వాల్ పరిస్థితి ఏంటి?
Image Credit : Asianet News

భారత్ నికితా పోర్వాల్ పరిస్థితి ఏంటి?

ఈ పోటీల్లో భారత్ తరఫున ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత నికితా పోర్వాల్ ప్రాతినిధ్యం వహించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికితా, టాప్ 40లోకి అడుగుపెట్టారు. కానీ టాప్ 20 రౌండ్‌కు చేరుకోలేకపోయారు. అయినా కూడా ఆమె ప్రదర్శనకు మంచి మార్కులే పడ్డాయి.

తన 'ప్రాజెక్ట్ మాటి' ద్వారా గిరిజన తెగల సంస్కృతిని, సంప్రదాయాలను ఆమె ప్రపంచానికి చాటిచెప్పారు. ఫినాలే రౌండ్‌లో మీనాక్షి అమ్మవారి నుంచి ప్రేరణ పొందిన 'డ్యాన్సెస్ ఆఫ్ ది వరల్డ్' పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. నికితా ప్రదర్శనపై మిస్ ఇండియా ఆర్గనైజేషన్ స్పందిస్తూ.. "నికితా ఎంతో గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. మేము ఎప్పుడూ నీ పట్ల గర్వపడతాం" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కాగా, 1951లో ఈరిక్ మోర్లే ప్రారంభించిన ఈ మిస్ వరల్డ్ పోటీల తదుపరి ఎడిషన్ (74వ ఎడిషన్) 2027లో తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో జరగనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ
Recommended image2
Yash: సంచలనం సృష్టిస్తున్న సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ సపోర్ట్.. ఫొటోలు చూసేయండి!
Recommended image3
OTT: సముద్రంలో దొరికిన బంగారు ఆభరణంతో ఊహించని చిక్కులు.. అదిరిపోయే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మిస్ కావొద్దు
Related Stories
Recommended image1
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image2
World Highest Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన.. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతం ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved