- Home
- Automobile
- Top 7 Seater Cars : పెద్ద ఫ్యామిలీకి సరిపోయేలా.. చీప్ ఆండ్ బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే
Top 7 Seater Cars : పెద్ద ఫ్యామిలీకి సరిపోయేలా.. చీప్ ఆండ్ బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే
ఇండియాలో రూ.15 లక్షల లోపు బడ్జెట్‌లో దొరికే బెస్ట్ 7 సీటర్ కార్ల గురించి ఇప్పుడు చూద్దాం. పెద్ద కుటుంబాలకు ఈ కార్లు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే ఆ బడ్జెట్ కార్లు ఏవో తెలుసుకుందాం.

బడ్జెట్ ప్రెండ్లీ 7 సీటర్ కార్లు
పెద్ద కుటుంబం కలిగినవాళ్లు లేదంటే ఎక్కువమందిని వెంటేసుకుని తిరిగేవాళ్లు పెద్ద కారును ఉపయోగిస్తుంటారు. ఇలాంటివారికి పర్ఫెక్ట్ ఛాయిస్ 7 సీటర్ కార్లు… అందరూ కలిసి ఒకేసారి ప్రయాణించడానికి ఇవి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. అయితే ఈ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయని కొనడానికి చాలామంది వెనకడుగు వేస్తుంటారు… కానీ చీఫ్ ఆండ్ బెస్ట్ సెవెన్ సీటర్ కార్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
రూ.15 లక్షల లోపు బడ్జెట్‌లో మంచి 7 సీటర్ కారు కొనాలని మీరుగానీ, మీ ప్రెండ్స్, బంధువులు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ బడ్జెట్ ప్రెండ్లీ కార్లను పరిశీలించవచ్చు. మారుతి సుజుకి, రెనాల్ట్, నిస్సాన్, మహీంద్రా లాంటి కంపెనీల మోడల్స్ తక్కువ ధరలో 7 సీటర్ల కోసం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
నిస్సాన్ గ్రావైట్, రెనాల్ట్ ట్రైబర్
నిస్సాన్ గ్రావైట్, రెనాల్ట్ ట్రైబర్.. ఈ రెండూ ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారైన కాంపాక్ట్ MPV కార్లు. ఈ రెండు మోడల్స్‌లో 71 bhp పవర్, 96 Nm టార్క్ ఇచ్చే 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. గ్రావైట్ మోడల్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG వస్తుంది. కానీ ట్రైబర్‌లో డీలర్ ద్వారా లేదా ఆఫ్టర్ మార్కెట్ ద్వారా మాత్రమే CNG కిట్ అమర్చుకోవాలి.
ఈ రెండు కార్లలో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే.. మూడో వరుస సీట్లను పూర్తిగా తీసేయొచ్చు. రెండో వరుస సీట్లను మడిస్తే, బూట్ స్పేస్ 1,000 లీటర్లకు పైగా పెరుగుతుంది. 8 ఇంచ్ టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అయితే గ్రావైట్ కారు ఆన్-రోడ్ ధర రూ.6.92 లక్షల నుంచి రూ.11.20 లక్షల వరకు (ఎక్స్ షోరూం) ఉంది. అదే రెనాల్ట్ ట్రైబర్ కారు ధర రూ.6.85 లక్షల నుంచి రూ.10.43 లక్షల వరకు ఉంది.
మహీంద్రా బొలెరో
MPV కార్లకు బదులుగా, రఫ్ అండ్ టఫ్‌గా ఉండే 7 సీటర్ SUV కారు కావాలనుకునే వారికి మహీంద్రా బొలెరో బెస్ట్ ఛాయిస్. ఈ కారులో 75 bhp పవర్, 210 Nm టార్క్ ఇచ్చే 1.5 లీటర్, 3 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో వస్తుంది.
గుంతల రోడ్లపై కూడా సాఫీగా వెళ్లేందుకు బొలెరో లోని లాడర్-ఫ్రేమ్ ఛాసిస్ బాగా ఉపయోగపడుతుంది. 7 ఇంచ్ టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, మడవగలిగే మూడో వరుస సీట్లు, లెదరెట్ సీట్లు దీని ముఖ్య ఫీచర్లు. దీని ఆన్-రోడ్ ధర రూ.10.82 లక్షల నుంచి రూ.12.59 లక్షల వరకు ఉంది.
మారుతి సుజుకి ఎర్టిగా
రూ.15 లక్షల బడ్జెట్‌లో దొరికే మరో పాపులర్ 7 సీటర్ మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా. ఈ కారులో 101 bhp పవర్, 139 Nm టార్క్ ఇచ్చే 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ S-CNG వేరియంట్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే దొరుకుతుంది.
ఎర్టిగాలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, 7 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో టచ్ స్క్రీన్ ముఖ్య ఫీచర్లు. రెండో వరుసలో వన్-టచ్ టంబుల్ అండ్ స్లైడ్ సీట్లు, రూఫ్‌కి అమర్చిన ఏసీ వెంట్స్, వెనుకవైపు USB-C ఛార్జింగ్ పోర్ట్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. దీని ఆన్-రోడ్ ధర రూ.10.47 లక్షల నుంచి రూ.16.51 లక్షల వరకు ఉంది.

