Top 5 Scooters : ఇండియన్స్ ఎగబడి కొంటున్న టాప్ 5 స్కూటర్లు ఇవే
భారతీయ మహిళలే కాదు పురుషులు కూడా స్కూటర్లను వాడుతున్నారు… అందుకే బైక్స్ కంటే వీటికే డిమాండ్ ఎక్కువగా ఉంది. మరి మనదేశంలో అత్యధికంగా సేల్ అవుతున్న టాప్ 5 స్కూటర్లు ఏవో తెలుసా?

టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్స్
భారతదేశంలో స్కూటర్ అంటే కేవలం ప్రయాణానికి ఉపయోగపడేది మాత్రమే కాదు, ప్రతి కుటుంబం రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. ఆఫీసుకు వెళ్లాలన్నా, పిల్లలను స్కూల్‌లో దింపాలన్నా, కూరగాయలు, సరుకులు తేవాలన్నా.. సిటీ ట్రాఫిక్‌లో బైక్‌ల కంటే స్కూటర్ నడపడం మహిళలకు, పెద్దలకు చాలా సులభం. అందుకే ప్రతినెలా లక్షల స్కూటర్లు ఇండియాలో అమ్ముడవుతున్నాయి. మీరు కూడా కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే భారతీయులు ఎక్కువగా ఇష్టపడి కొంటున్న టాప్ 5 స్కూటర్లు ఏవో తెలుసుకొండి… అందులోంచి మీకు నచ్చింది ఎంచుకొండి.
హోండా యాక్టివా (Honda Activa)
భారతీయుల ఫేవరెట్ స్కూటర్ గా పేరుగాంచిన 'హోండా యాక్టివా'… అమ్మకాల్లో ఇదే మొదటి స్థానంలో ఉంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం సుమారు 2,06,170 యూనిట్లు అమ్ముడై తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కుటుంబంలో ఆడామగా ఎవరైనా దీన్ని చాలా సులభంగా నడపొచ్చు, ఎక్కువ కాలం మంచి సర్వీస్ ఇచ్చే స్కూటర్ ఇది.
టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)
హోండా యాక్టివాకు ప్రత్యక్ష పోటీనిచ్చే టీవీఎస్ జూపిటర్ అమ్మకాల్లో రెండో స్థానంలో ఉంది. రిపోర్ట్స్ ప్రకారం సుమారు 1,48,595 యూనిట్లు అమ్ముడయ్యాయి. సౌకర్యవంతమైన సీటు, మంచి లెగ్-స్పేస్, పెద్ద స్టోరేజ్, అద్భుతమైన మైలేజ్ కారణంగా మధ్యతరగతి కుటుంబాలు జూపిటర్‌ను ఎక్కువగా ఇష్టపడతాయి.
సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125)
125cc ఇంజిన్ సామర్థ్యం ఉన్న స్కూటర్లలో సుజుకి యాక్సెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇటీవల 82,505 యూనిట్లు అమ్ముడయ్యాయి… గత ఏడాదితో పోలిస్తే సుమారు 21% అధిక వృద్ధిని నమోదు చేసింది. క్లాసిక్ లుక్‌తో పాటు మంచి పికప్, మైలేజ్ కోరుకునే వారికి యాక్సెస్ 125 ఒక బెస్ట్ ఛాయిస్.
టీవీఎస్ ఐ-క్యూబ్ (TVS iQube)
మీరు పెట్రోల్‌కు బదులుగా ఎలక్ట్రిక్ స్కూటర్ (EV) కోసం చూస్తున్నట్లయితే టీవీఎస్ ఐ-క్యూబ్ ముందు వరుసలో ఉంది. మొత్తం స్కూటర్ల అమ్మకాల్లో 4వ స్థానాన్ని పొందిన ఈ స్కూటర్, సుమారు 59,386 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది ప్రాతిపదికన ఈ స్కూటర్ 158% వృద్ధి సాధించి, EV మార్కెట్లో కొత్త రికార్డు సృష్టించింది.
బజాజ్ చేతక్ (Bajaj Chetak)
ఒకప్పుడు భారతీయుల ఫేవరెట్ స్కూటర్ అయిన ‘చేతక్’ ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో వచ్చి దుమ్మురేపుతోంది. ఈ స్కూటర్ సుమారు 47,184 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 11,584 యూనిట్లు మాత్రమే అమ్ముడైన చేతక్, ఈసారి భారీ వృద్ధిని నమోదు చేసింది. దీని మెటల్ బాడీ, ప్రీమియం లుక్‌కు కస్టమర్లు ఫిదా అయ్యారు.
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఇప్పుడు పెట్రోల్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లకు (EV) కూడా అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. మీ బడ్జెట్, వినియోగానికి అనుగుణంగా పైన పేర్కొన్న టాప్ 5 స్కూటర్లలో ఒకదాన్ని మీరు ఎలాంటి సందేహం లేకుండా ఎంచుకోవచ్చు… హాయిగా జర్నీ చేయవచ్చు.

