MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 06.09.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Sep 06 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులుంటాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు. సంతానం విద్య, ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ క్షేత్రాలు దర్శించుకుంటారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. మిత్రులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటా బయటా సమస్యలు కొంత బాధిస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమవుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందుకు సాగుతారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. శ్రమతో కానీ పనులు పూర్తి కావు. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఇంటా బయటా చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి . నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరు అవుతారు. ఉద్యోగాలలో మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు!
Recommended image2
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎవ్వరిమీద ఆధారపడరు.. వారి నిర్ణయమే ఫైనల్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Related Stories
Recommended image1
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. ఈ 5 విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం ప్రమాదకరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved