MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!

Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!

Vinayaka Chavithi 2026: ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14న వస్తోంది. ఆ రోజున గ్రహాల అరుదైన సంచారం వల్ల 4 రాశులవారి జీవితాల్లో ఉన్న సమస్యలు, అడ్డంకులు తొలగిపోయి, ఊహించని సక్సెస్ రానుంది. మరి ఆ అదృష్ట రాశులేవో, వారికి ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 27 2026, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వినాయక చవితి తర్వాత లబ్ధి పొందే రాశులు
Image Credit : Pixabay

వినాయక చవితి తర్వాత లబ్ధి పొందే రాశులు

వినాయక చవితి అంటే విఘ్నాలను తొలగించే వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించే పండగ. గణపతి అనుగ్రహంతో కొత్త పనులు విజయవంతంగా సాగుతాయని, జీవితంలోని అడ్డంకులు తొలగుతాయని భక్తుల విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రంలో వినాయకుడిని కేతు గ్రహానికి అధిపతిగా, తెలివితేటలకు కారకుడిగా భావిస్తారు. ఈ సమయంలో కన్య రాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. దీనివల్ల వృత్తి, వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి గ్రహాల అనుకూల సంచారం వల్ల వినాయక చవితి తర్వాత ఏ రాశులవారికి మేలు జరుగుతుందో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సింహ రాశి
Image Credit : our own

సింహ రాశి

సూర్యుడు సింహరాశిలో సంచరించే సమయంలో వినాయక చవితి వస్తోంది. ఇది మీకు రాజయోగాన్ని ఇవ్వబోతోంది. ఇప్పటివరకు ఆగిపోయిన ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ వినాయకుడి దయతో మళ్లీ వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారాలలో కొత్త పరిచయాలు, భాగస్వామ్యాలు కలిసివస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. గణపతి ఆరాధనతో పాటు క్రమశిక్షణగా పనిచేయడం సింహ రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

35
కన్య రాశి
Image Credit : our own

కన్య రాశి

కన్య రాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు వినాయక చవితి వస్తుండటంతో, మీ తెలివితేటలు రెట్టింపు అవుతాయి. విద్యార్థులకు, వ్యాపారులకు ఊహించని విజయం దక్కుతుంది. చాలాకాలంగా ఒక పని కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కవచ్చు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

45
వృశ్చిక రాశి
Image Credit : our own

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి అన్ని విఘ్నాలు తొలగిపోయే సమయం ఇది. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న అప్పులు, శత్రువుల బెడద తొలగిపోతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. దూర ప్రయాణాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. అయితే ప్రతి విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

55
మకర రాశి
Image Credit : our own

మకర రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని ప్రభావం ఉన్న మకర రాశి వారికి ఈ వినాయక చవితి రోజున అన్ని కష్టాలు తొలగిపోయి, పెద్ద టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవడం కంటే, వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: దసరా కి ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో హోదాలు.. ప్రముఖులతో పరిచయాలు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆప్తుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి!
Related Stories
Recommended image1
Telugu Saying: అంతా మనవాళ్లే కానీ.. అన్నానికి రమ్మనే వాళ్లు లేరు! ఈ కాలానికి తగ్గ సామెత!
Recommended image2
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved