MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Union Budget లో వైజాగ్ ప్రస్తావనే లేదు.. అయినా ఈ నగరానికి మహర్దశ, ఎలాగో తెలుసా..?

Union Budget లో వైజాగ్ ప్రస్తావనే లేదు.. అయినా ఈ నగరానికి మహర్దశ, ఎలాగో తెలుసా..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026 ప్రసంగంలో విశాఖపట్నం పేరే వినిపించలేదు. కానీ ఈ బడ్జెట్ వల్ల వైజాగ్ రూపరేఖలే మారిపోనున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ఇదే అంటున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 02 2026, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వైజాగ్ రూపురేఖలే మారిపోనున్నాయి...
Image Credit : Gemini AI

వైజాగ్ రూపురేఖలే మారిపోనున్నాయి...

Visakhapatnam : ఎన్డిఏ కూటమిలో బిజెపి తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశమే.. ఇంకా చెప్పాలంటే ఈ పార్టీ సపోర్ట్ లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కు ఈ బడ్జెట్ 2026 లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందని అందరూ భావించారు... కానీ అలా జరగలేదు. అయితే నేరుగా నిధులు ఇవ్వకున్నా బడ్జెట్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాల ద్వారా ఏపీకి భారీ లాభం జరగనున్నట్లు తెలుస్తోంది.

24
డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే... వైజాగ్ కు మహర్దశ
Image Credit : Getty

డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే... వైజాగ్ కు మహర్దశ

భాతర దేశంలో కాదు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను విశాఖపట్నంలో ఏర్పాటుచేసేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ సిద్దమయ్యింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం కూడా పూర్తయ్యింది... భూకేటాయింపులు, ఇతర అనుమతులు కూడా పూర్తయ్యాయి.

ఇక రిలయన్స్ కూడా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్దమయ్యింది. ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తుండటంతో రాబోయే కొన్నేళ్లలో విశాఖ డేటా సెంటర్ హబ్ గా మారనుంది. భారీ పెట్టుబడితో లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విశాఖ అభివృద్ధికి ఈ డేటా సెంటర్ల ఏర్పాటు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ క్రమంలోనే తాజా బడ్జెట్ లో డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం విశాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. 2047 వరకు డేటా సెంటర్లకు పన్ను రాయితీలు కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో విశాఖకు మరిన్ని డేటా సెంటర్లు తరలిరానున్నాయి. కాబట్టి ఈ నగరం ఐటీ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ-కామర్స్ రంగాల్లో మరింత దూసుకుపోనుంది.

ట్యాక్స్ మినహాయింపుతో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు విశాఖకు తరలివచ్చే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకు సాగుతోంది... విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దీంతో విశాఖలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడమే కాదు రియల్ ఎస్టేట్ కూడా మరింత ఊపందుకోనుంది.

Related Articles

Related image1
Union Budget 2026 : నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
Related image2
Now Playing
Union Budget 2026 Modi Speech: యూనియన్ బడ్జెట్ 2026 పై మోదీ కీలక ప్రసంగం| Asianet News Telugu
34
చంద్రబాబు కామెంట్స్..
Image Credit : Nara Chandrababu Naidu Official/Youtube

చంద్రబాబు కామెంట్స్..

డేటా సెంటర్లకు పన్ను రాయితీలు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇండియా డేటా సెంటర్ హబ్ గా మారుతుందని... ఇప్పటికే విశాఖకు 10 గిగావాట్ కెపాసిటీ డేటాసెంటర్స్ ఏర్పాటుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వీటికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనుమతుల విషయం ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు.

అయితే ఒక్కసారి డేటా సెంటర్ వస్తే ఏఐ వస్తుంది... ఇది గేమ్ చేంజర్ గా మారనుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే త్వరలోనే వరల్డ్ క్లాస్ సదుపాయాలతో ఏఐ యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇది స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగాా ఉంటుందని... బెస్ట్ ఏఐ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు.

డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ ఇస్తూ కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు.
విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయి. 
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయి. #UnionBudget2026#ChandrababuNaidu#AndhraPradeshpic.twitter.com/J1NdGAZSkl

— Telugu Desam Party (@JaiTDP) February 2, 2026

44
డేటా సెంటర్లకు రాయితీతో హైదరాబాద్ కు లాభమే...
Image Credit : Gemini AI

డేటా సెంటర్లకు రాయితీతో హైదరాబాద్ కు లాభమే...

బడ్జెట్ లో డేటా సెంటర్లకు రాయితీలు ఇస్తామన్న కేంద్రం ప్రకటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కూడా ఎంతో మేలు చేయనుంది. ఇప్పటికే నగరంలో 26 డేటా సెంటర్లు ఉన్నాయి... వీటికి పన్ను మినహాయింపుతో చాలా ప్రయోజనాలుంటాయి. తద్వారా ఆయా కంపెనీలు డేటా సెంటర్ల విస్తరణ, కొత్తవాటి ఏర్పాటుకు ముందుకువస్తాయి... దీంతో నగరంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే ఐటీ రంగంలో టాప్ లేపుతున్న హైదరాబాద్ భవిష్యత్ లో మరింత దూసుకుపోనుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విశాఖపట్నం
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
నారా చంద్రబాబు నాయుడు
కేంద్ర బడ్జెట్
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ రాయలసీమ జిల్లాలో అమరావతి స్థాయి రియల్ బూమ్.. భూములకు రెక్కలురావడం ఖాయం
Recommended image2
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే
Recommended image3
Now Playing
MoC Signing on Amended BharatNet: ఇకపై గ్రామీణ ప్రాంతాలకుహై స్పీడ్ ఇంటర్నెట్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
Union Budget 2026 : నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
Recommended image2
Now Playing
Union Budget 2026 Modi Speech: యూనియన్ బడ్జెట్ 2026 పై మోదీ కీలక ప్రసంగం| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved