Union Budget 2026 : నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
సారాంశం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ 2026 ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కీలక ప్రకటనలు, పాలనాపరమైన నిర్ణయాలు, రంగాల వారిగా కీలక అంశాలు, వ్యవసాయం, రైల్వే, మౌళిక సదుపాయాలు, రక్షణ, హెల్త్ వంటి సమాచారం ఇక్కడ చూడండి..
01:53 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveబడ్జెట్ 2026 లో కేటాయింపులు...
బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
సెమీకండక్టర్ మిషన్‌కు రూ.40 వేల కోట్లు
కంటైనర్ తయారీ రంగానికి రూ.10 వేల కోట్లు
ఆత్మనిర్భర్ భారత్‌కు రూ.2 వేల కోట్లు
MSME రంగానికి రూ.10 వేల కోట్లు
మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు
సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు
12:31 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveన్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ వస్తువులపై డ్యూటీ ఫ్రీ
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 2035 వరకు ఉండదు. అన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ కు ఇది వర్తిస్తుంది.
12:26 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveమత్స్యకారులకు డ్యూటీ ఉండదు
మత్స్యకారులకు డ్యూటీ ఉండదు.. విదేశీ పోర్టులకు తరలిస్తే ఎగుమతిగా గుర్తింపు... అంతర్జాతీయ ట్రావెల్స్ గూడ్స్ పై డ్యూటీ ప్రీ ఉంటుంది..
12:25 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveఆదాయ పన్నుకు శిక్షలుండవు
ఆదాయ పన్ను రిటర్న్ వెల్లడించినందుకు ఎలాంటి జైలు శిక్ష ఉండదు.. కేవలం ఫెనాల్టీ మాత్రమే ఉంటుంది. ఆదాయాన్ని దాచిపెట్టేవారికి మాత్రమే ఫెనాల్టీలు.
12:22 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveటారీఫ్స్ తగ్గింపు
వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువులకుటారీఫ్ రేట్స్ 20 నుండి 10 శాతానికి తగ్గింపు
17 క్యాన్సర్ మెడిసిన్స్ కు టారీప్స్ తగ్గింపు
పేషెంట్స్ ఉపయోగపడే వస్తువులకు టారీఫ్స్ తగ్గింపు
12:19 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveఇండియాలో తయారుచేసే వస్తువులకు టారీఫ్స్ తగ్గింపు
ఇండియాలో తయారుచేసే వస్తువులకు ట్యాక్స్ తగ్గింపు
లెదర్, టెక్స్ టైల్స్ తగ్గింపు
డ్యూటీ ఫ్రీ వస్తువు
లెదర్, సింథటిక్ వస్తువుల తగ్గింపు
సోడియం యాంటీ మోనైట్ కస్టమ్స్ డ్యూటీ
సివిల్ ఆండ్ డిఫెన్స్ లో టారీఫ్స్ తగ్గింపు
ఎయిర్ క్రాప్ట్ తయారీ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
SEZ లో తయారయ్యే వస్తువులపై టారీఫ్స్ తగ్గింపు
12:15 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveక్లౌడ్ సర్వీసులకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే
డేటా సెంటర్ సర్వీసులకు కూడా ఊరట కల్పించేలా నిర్ణయాలు... క్లౌడ్ సర్వీసులకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే
12:13 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveమ్యాన్ పవర్ సరఫరా సంస్థలకు టిడిఎస్ తగ్గింపు
మ్యాన్ పవర్ సరఫరా సంస్థలకు టిడిఎస్ తగ్గింపు
12:09 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveఐటీ రంగం
ఐటీ రంగంలో భారత్ టాప్... అందుకే ఈ రంగానికి ట్యాక్స్ లో ఊరట...ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ చేసేలా ఏర్పాట్లు
12:06 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveవిదేశీ ఆస్తుల ప్రకటన
విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్ టైమ్ స్కీం అమలు చేయనున్నట్ల తెలిపారు.
12:04 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveఐటీఆర్ చెల్లింపు
ఐటిఆర్ చెల్లింపుకు 31 ఆగస్ట్ వరకు సమయం... TCS 5 శాతం నుండి 2 శాతానికి తగ్గింపు
12:03 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveజిల్లాకో బాలికల హాస్టల్
ప్రతి జిల్లాకు ఓ బాలికల హాస్టల్ నిర్మించనున్నట్లు ప్రకటన... బాలికల చదువుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తాం.
12:00 PM (IST) Feb 01
Union Budget 2026-27 Liveప్రమాద భీమాకు ట్యాక్ లేదు
డైరెక్ట్ ట్యాక్స్... న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం1 ఏప్రిల్ నుండి అమలు... సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు... ప్రమాద భీమాకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు.. ఎడ్యుకేషన్, మెడికల్ కు ట్యాక్స్ తగ్గింపు...
11:55 AM (IST) Feb 01
Union Budget 2026-27 Live16వ ఫైనాన్స్ కమీషన్ సిపారసులకు ఆమోదం
16వ ఫైనాన్స్ కమీషన్ సిపారసులు... వీటికి ఆమోదం తెలిపాం... దీని కింద రాష్ట్రాలు రూ.1.4 లక్షల కోట్లు 2026 లో అందిస్తాం... రూరల్, అర్బన్ లోకల్ బాడీస్ కు అందిస్తాం.
11:54 AM (IST) Feb 01
Union Budget 2026-27 Liveనార్త్ ఈస్ట్ స్టేట్స్ డెవలప్మెంట్
నార్త్ ఈస్ట్ స్టేట్స్... పర్యాటకం కోసం 4000 ఎలక్ట్రిక్ బస్సులు... బుద్దిస్ట్ సర్కిట్ అరుణాచల్, అస్సాం, మిజోరాం, త్రిపుర వంటి రాష్ట్రాలు...
11:52 AM (IST) Feb 01
Union Budget 2026-27 Liveదివ్యాంగజన్ కౌశల్ యోజన
దివ్యాంగజన్ కౌశల్ యోజన... వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తాం... ట్రైనింగ్ అందిస్తాం
దివ్యాంగ్ సహారా యోజన... ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్.... పిఎం దివ్యాష కేంద్రాల ద్వారా ఉపయోగపడే వస్తువులు
11:49 AM (IST) Feb 01
Union Budget 2026-27 Liveకోకోనట్ ప్రమోషన్ స్కీమ్స్
కోకోనట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి... కోకోనట్ ప్రమోషన్ స్కీమ్స్...
క్రీడా రంగంలో ఖేలో ఇండియా మిషన్... కోచింగ్, సపోర్ట్ స్టాప్ ఏర్పాటు... క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు..
చిన్న మధ్యతరగతి రైతులు, దివ్యాంగులకు, అణగారిన వర్గాలు సపోర్ట్స్
500 రిజర్వాయర్లను అమ్రుత్ సరోవర్ గా ఏర్పాటు
11:44 AM (IST) Feb 01
Union Budget 2026-27 Liveఅరకులో వరల్డ్ క్లాస్ ట్రెక్కింగ్ సదుపాయాలు
వరల్డ్ క్లాస్ ట్రెక్కింగ్ ఆండ్ హైక్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అరకు వ్యాలీ ఎంపిక. పులికాట్ లేక్ ను కూడా పర్యాటకానికి అనుకూలంగా మార్చడం...15 ఆర్కిలాజికల్ సైట్ ఏర్పాటుకు నిర్ణయం
11:42 AM (IST) Feb 01
Union Budget 2026-27 Liveపర్యాటకం
పైలట్ స్కీమ్ గా 10 వేల గైడ్స్ కు స్కిల్ డెవలప్మెంట్... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా ట్రైనింగ్