నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం ఆగష్టు 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నితిన్ అండ్ టీం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆడియన్స్ మూడ్ మారింది. సినిమాలో ఏదో ఒక వెరైటీ లేకుంటే ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.

నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం ఆగష్టు 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నితిన్ అండ్ టీం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆడియన్స్ మూడ్ మారింది. సినిమాలో ఏదో ఒక వెరైటీ లేకుంటే ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. మాచర్ల చిత్ర యూనిట్ ఐటెం సాంగ్ విషయంలో చేసిన ప్రయోగం భలే కలసి వచ్చింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఐటెం సాంగ్ లో హీరోయిన్ అంజలి నితిన్ తో కలసి స్టెప్పులు వేసింది. రా రా రెడ్డి అంటూ సాగే ఈ మాస్ ఐటెం సాంగ్ నెట్టింట దుమ్ములేపుతోంది. అంజలి అందాలు, నితిన్ డ్యాన్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఐటెం సాంగ్ చివర్లో నితిన్ జయం మూవీలోని 'రాను రానంటూనే చిన్నదో' అనే సూపర్ హిట్ సాంగ్ జోడించారు. 

ఈ ప్రయోగం బాగా సక్సెస్ అయ్యింది. ఈ పాటకు నెటిజన్లు తనదైన స్టైల్ లో వీడియోలు చేస్తూ.. నితిన్, అంజలి లాగా డ్యాన్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ సాంగ్ కి ఫిదా అవుతున్న వారిలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా టీమిండియా యువ క్రికెటర్, స్పిన్ సంచలనం యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ' రాను రానంటూనే సిన్నదో' అంటూ స్టెప్పులేసింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ధనశ్రీ హాట్ గా మైండ్ బ్లోయింగ్ స్టెప్పులు వేస్తూ చూపు తిప్పుకోనీయడం లేదు. ఊర మాస్ స్టెప్పులతో ఫుల్ జోష్ లో ధనశ్రీ డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నితిన్, అంజలి తరహాలో ధనశ్రీ కూడా కంప్లీట్ సింక్ లో స్టెప్పులు వేస్తూ అదరగొడుతోంది. ధనశ్రీ డ్యాన్స్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

View post on Instagram