Asianet News TeluguAsianet News Telugu

మరోసారి పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా

మరోసారి పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా
vijay malya married again

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన ఉదంతం ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గతంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఎయిర్హోస్టెస్గా పనిచేసిన పింకీ లాల్వానీని ఆయన వివాహం చేసుకోనున్నారు. అయితే మాల్యా మూడో వివాహానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. మాల్యా కంటే వయసులో చాలా చిన్నది. మూడేళ్లుగా అతనితో కలిసి ఉంటుందని సమాచారం. మాల్యా ఉండే లండన్కు సమీపంలోని హెర్ట్ఫోర్డ్షైర్ మాన్షన్లోనే పింకీ కూడా ఉంటుందని తెలుస్తోంది.

మాల్యా దేశం వదిలి వెళ్లిపోయిన సమయంలోనే ఈ పింకీ కూడా వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు లండన్ లో గడుపుతున్న వీళ్లు ఈ మధ్యే  లివింగ్ రిలేషన్ షిప్ లో అడుగుపెట్టి మూడేళ్లయిన సందర్భంగా లండన్ లో సెలబ్రేట్ చేసుకున్నారట. మాల్యా తల్లితోనూ ఆమె తరచూ కనిపిస్తూ ఉంటుంది. లండన్ వెస్ట్ మిన్ స్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టులో జరుగుతున్న విచారణకు మాల్యాతో కలిసి వస్తుందని అక్కడి మీడియా చెప్తోంది. మాల్యా 2016 - మార్చి నుంచి యూకేలోనే ఉంటున్న విషయం తెలిసిందే. మాల్యా తొలిసారి 1986లో ఎయిరిండియా ఎయిర్ హోస్టెస్ సమీరా త్యాబ్జీని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏడాదిలోపే విడాకులు తీసుకున్నారు. 1993లో చిన్ననాటి నుంచి పరిచయం ఉన్న రేఖా మాల్యాను పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండు పెళ్లిళ్ల నుంచి మాల్యాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్లు సిద్దార్థ్ - లియానా - తాన్యా. తాజాగా ఇది ఆయనకు మూడో వివాహం.

Follow Us:
Download App:
  • android
  • ios