‘ఎఫ్‌ 2’ కాంబినేషన్‌ లోనే ‘ఎఫ్‌ 3’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పాత్రలు చాలా చిత్రంగా డిజైన్ చేసారని తెలుస్తోంది. ‘ఎఫ్‌ 2’లానే సీక్వెల్‌ని కూడా మంచి నవ్వుల ప్రయాణంలా తెరకెక్కిస్తున్నారు.   

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహరీన్‌ నటించిన ‘ఎఫ్‌ 2’ మంచి హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ‘ఎఫ్‌ 2’ కాంబినేషన్‌ లోనే ‘ఎఫ్‌ 3’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పాత్రలు చాలా చిత్రంగా డిజైన్ చేసారని తెలుస్తోంది. ‘ఎఫ్‌ 2’లానే సీక్వెల్‌ని కూడా మంచి నవ్వుల ప్రయాణంలా తెరకెక్కిస్తున్నారు.

సంక్రాంతి అల్లుళ్లుగా ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) చిత్రంతో థియేటర్స్‌లో చేసిన హంగామా చేసిన వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ తాజాగా వెంకీ మళ్లీ ‘ఎఫ్‌ 3’ (ఫన్, ఫ్రస్ట్రేషన్‌ అండ్‌ వెర్‌ ఫన్‌)తో నవ్వించేందుకు రెడీ అవుతున్నారు. ‘ఎఫ్‌ 2’ని తెరకెక్కించిన అనిల్‌ రావిపూడియే ‘ఎఫ్‌ 3’కి దర్శకుడు. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ‘ఎఫ్‌ 2’లో లాగే వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్‌ నటిస్తుంది. కాగా ఈ చిత్రంలో రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో వరుణ్‌ నటిస్తున్నాడని తెలిసింది.

దీన్ని బట్టి వెండితెరపై వెంకీ, వరుణ్‌ల ఫన్‌ ‘ఎఫ్‌ 2’ను మించి ఉండనున్నట్లు తెలుస్తోంది. వెంకీ, వరుణ్‌ల ఫన్‌ ‘ఎఫ్‌ 2’ను మించి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్, మురళీ శర్మ, అంజలి కీలక పాత్రలో నటిస్తు‍న్నారు. సెకండాఫ్‌లో మురళీ శర్మ హంగామా మామూలుగా ఉండదట. వచ్చే సంక్రాంతికి ‘ఎఫ్‌ 3’ రిలీజ్‌ కానుంది.

ఈ మూవీ కోసం 70కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు అంచనా. కాగా ఎఫ్ 2 మాదిరే ఎఫ్ 3లో కూడా వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్‌ నటిస్తుంది. కాగా ఈ చిత్రంలో రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో వరుణ్‌ నటిస్తున్నాడని తెలిసింది. ఈ చిత్రంలో సునీల్, మురళీ శర్మ, అంజలి కీలక పాత్రలో నటిస్తు‍న్నారు. సెకండాఫ్‌లో మురళీ శర్మ హంగామా మామూలుగా ఉండదట. వచ్చే సంక్రాంతికి ‘ఎఫ్‌ 3’ రిలీజ్‌ కానుంది.