ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కాలేయసంబంధిత వ్యాధి కారణంగా బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్న సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. గురువారం నాడు మౌలాలి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి ఆయన భౌతికకాయాన్ని తీసుకువచ్చారు.

అక్కడ రెండు గంటలపాటు అభిమానుల సందర్శనార్ధం భౌతికకాయాన్ని ఉంచారు. చిరంజీవి, కరుణాకరన్, రాజీవ్ కనకాల ఇలా చాలా మంది ఇండస్ట్రీ వాళ్లు చివరి చూపుకి తరలి వచ్చారు. ఒకప్పటి యాంకర్ ఉదయభాను కూడా తన భర్తతో కలిసి ఫిలిం ఛాంబర్ కి చేరుకొని వేణుమాధవ్ భౌతికకాయాన్ని సందర్శించారు.

అనంతరం ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. బోరున ఏడుస్తూ వేణుమాధవ్ తో తనకున్న  బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకప్పుడు 'వన్స్ మోర్ ప్లీజ్' అనే షో చేసేవాళ్లమని.. చాలా అల్లరి చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. తనను వేణుమాధవ్ సొంత చెల్లిని చూసుకున్నట్లు చూసుకున్నాడని.. తను ఉంటే చాలు అందరూ నవ్వుతూనే ఉంటారని.. అతడి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

600కి పైగా సినిమాల్లో నటించిన వేణుమాధవ్ లక్ష్మి సినిమాకు గాను బెస్ట్ కమెడియన్ గా నంది పురస్కారాన్ని అందుకున్నారు. 

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..