. రీసెంట్ గా టెలివిజన్ యాక్టర్ రిచా బాద్రా కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాలను ప్రముఖ ఆంగ్ల మీడియా ద్వారా బయటపెట్టింది. 

బాలీవుడ్ లో మీటూ ఘాటు తక్కువవుతోంది అనుకుంటున్న సమయంలో ఎవరో ఒకరి కామెంట్స్ తో మళ్ళీ వైరల్ గా మారుతోంది. రీసెంట్ గా టెలివిజన్ యాక్టర్ రిచా బాద్రా కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాలను ప్రముఖ ఆంగ్ల మీడియా ద్వారా బయటపెట్టింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఒక నిర్మాత తనను సంతోష పరిస్తే మంచి అవకాశం అందుకోవచ్చని వల్గర్ గా మాట్లాడాడు అని తెలిపింది. బాలీవుడ్ టెలివిజన్ సిరీస్ లతో బాగా పాపులర్ అయిన రిచా బాద్రా కిచిడి సిరీస్ తో చైల్డ్ ఆర్టిస్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ కు వెళ్లే ప్రయత్నంలో క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డట్లు రిచా వివరణ ఇచ్చింది. 

స్టోరీ డిస్కర్షన్ లో భాగంగా హోటల్ కి రమ్మని చెప్పారు. నేను కాఫీ షాక్ వస్తాను అని ముందే క్లారిటీ ఇచ్చా. అయితే ఆ నిర్మాత తనను హ్యాపీ చేస్తే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చని చెడుగా మాట్లాడాడు. 

వెంటనే అతని నుంచి నేను తప్పించుకున్నా. పెళ్లి అనంతరం యాక్టింగ్ కెరీర్ కు నా ఫ్యామిలీ మద్దతు ఇచ్చింది. టివి షోలతో బాగానే ఉన్నా. ఇంట్లో వాళ్ళని నొప్పించి ఏ పని చేయలేను. వారికి నచ్చిన విధంగానే నేను అడుగేస్తానని రిచా తెలిపింది.