Asianet News TeluguAsianet News Telugu

విశ్వ సుందరికి అభిమాని ప్రేమలేఖ.. ఫిదా అయిన బ్యూటీ

సుస్మితను మెప్పించేందుకు ఓ అభిమాని ప్రేమ లేఖను రాశాడు. అయితే తన ప్రేమలేఖ తన అభిమాన కథనాయికను ఇంప్రెస్‌ చేస్తుందని తాను ఊహించి ఉండడు. సుస్మిత మాత్రం ఓ అభిమాని తనకు రాసిన ప్రేమలేఖపై స్పందించింది. ఏకంగా ఆ ప్రేమలేఖను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ, ఇలా మరిన్ని ప్రేమ లేఖలు రాయాలని కోరింది.

Sushmita Sen receives a handwritten love letter from a fan
Author
Hyderabad, First Published Jun 28, 2020, 9:40 AM IST

ఒక్కోసారి అభిమానులు తమ అభిమానాన్ని ప్రదర్శించే తీరు ఆ తారలను కూడా అవాక్కయ్యేలా చేస్తుంది. తమ అభిమాన తారలను ఇంప్రెస్‌ చేసేందుకు ఫ్యాన్స్ చాలా తంటాలు పడుతుంటారు. అలా ఓ అభిమాని తన ఫెవరెట్‌ హీరోయిన్‌ కు ప్రేమలేఖను రాశాడు. ఆ హీరోయిన్‌ మరెవరో కాదు. విశ్వసుందరి కిరీటాన్ని అందుకోవటంతో పాటు ఇండియన్ సినిమా లవర్స్‌ మనసులను గెలుచుకున్న భామ సుస్మితా సేన్.

సుస్మితను మెప్పించేందుకు ఓ అభిమాని ప్రేమ లేఖను రాశాడు. అయితే తన ప్రేమలేఖ తన అభిమాన కథనాయికను ఇంప్రెస్‌ చేస్తుందని తాను ఊహించి ఉండడు. సుస్మిత మాత్రం ఓ అభిమాని తనకు రాసిన ప్రేమలేఖపై స్పందించింది. ఏకంగా ఆ ప్రేమలేఖను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ, ఇలా మరిన్ని ప్రేమ లేఖలు రాయాలని కోరింది. చిన్న ఉత్తరమే అయినా తన మనస్సులోని భావాలతో నిండి ఉందని ఆనందం వ్యక్తం చేసింది సుష్మితా సేన్‌.

ఈ లేఖను తన సోషల్‌  మీడియా పేజ్‌లో షేర్‌ చేసి సుస్మిత... స్వ హస్తాలతో రాసిన ప్రేమలేఖలు నాకు చాలా ఇష్టం. ఇన్నేళ్లుగా ప్రజల అభిమానం, ప్రేమ దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. తొలిసారి ఇలా ఓ అభిమాని సింపుల్‌గా లవ్‌ లెటర్‌ రాసి పంపారు. చిన్న లెటర్ అయినా ఇది హృదయానికి హత్తుకునేలా ఉంది. ఈ లెటర్‌ను లైఫ్‌ లాంగ్ గుర్తు పెట్టుకుంటా. `ఐ లవ్‌ యూ టూ` అని రిప్లై ఇచ్చింది సుస్మితా.

Follow Us:
Download App:
  • android
  • ios