కామాంధుడా...నీది తెగి పడిపోవాలి, పిల్లలు లేకుండా చావు : శ్రీరెడ్డి

Sri revealed fired on top producer
Highlights

కామాంధుడా...నీది తెగి పడిపోవాలి, పిల్లలు లేకుండా చావు

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన విషయాలు బైటపెడడుతూ గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన నటి శ్రీ రెడ్డి  తన సోషల్ మీడియా పేజీల్లో రోజుకో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు సంబంధించిన ఫోటోలు బైటపెట్టి బండారం బట్టబయలు చేసిన శ్రీ రెడ్డి మరింత మంది గుట్టు విప్పుతానంటూ.. శ్రీ రెడ్డి లీక్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ అవ్వాలని వచ్చే అమ్మాయిలు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని... కామాంధులైన కొందరు నిర్మాతలు, దర్శకుల చేతికి చిక్కి ఎందరో జీవితాలు నాశనం అవుతున్నాయంటూ పలు టీవీ చానల్స్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వెల్లడించారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా కొందరు సినీ ప్రముఖుల మీద సంచలన ఆరోపణలు చేశారు. అరేయ్ సొల్లుగా, నీ దిమ్మ తిరిగిపోతుంది. కామాంధుడా...నీది తెగి పడిపోవాలి, పిల్లలు లేకుండా చావు అంటూ ఓ ప్రముఖ నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసింది.  

 ప్రతి ఒక్క రాష్ట్రం మా ఏరియా, మా బాష, మా లోకల్ ఆర్టిస్టులను కాపాడుకోవాలి అనుకుంటుంటే(ముఖ్యంగా తమిళనాడులో) మన తెలుగు రాష్ట్రాల్లో ఆ తెలుగు అభిమానం లేకపోవడం బాధాకరం అంటూ శ్రీరెడ్డి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదని, ఈ ఇండస్ట్రీ చాలా క్లీన్ గా ఉందని రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్లను శ్రీరెడ్డి ఖండించారు. కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నీకు మా లాంటి వారి బాధ ఏం తెలుసు? నీలాంటి వారిని ఇండస్ట్రీలో ఉంచకూడదనే మా ప్రయత్నం... అంటూ శ్రీరెడ్డి రకుల్ మీద ఫైర్ అయింది.
 

loader