కుదిరితే కేటీఆర్ తో వెళ్లాలని వుంది -శ్రీ రెడ్డి

sri reddy wants to have candle light dinner with ktr
Highlights

తెలంగాణ మంత్రి కేటీఆర్ తో అలా వెళ్లాలనుందంటోంది శ్రీ రెడ్డి

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన విషయాలు బైటపెడడుతూ గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన నటి శ్రీ రెడ్డి  తన సోషల్ మీడియా పేజీల్లో రోజుకో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు సంబంధించిన ఫోటోలు బైటపెట్టి బండారం బట్టబయలు చేసిన శ్రీ రెడ్డి మరింత మంది గుట్టు విప్పుతానంటూ.. శ్రీ రెడ్డి లీక్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

 

అయితే ఓ పక్క టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అణచివేతకు ప్రభుత్వ జోక్యం అవసరం అంటూ డిమాండ్ చేస్తున్న శ్రీ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ పెద్దలను బాగానే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం... తెలంగాణ సర్కారునే నమ్ముకున్నానంటూ శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టింది. తాజాగా శ్రీ రెడ్డి తెలంగాణ సర్కారులో కీ లీడర్ అయిన మంత్రి కేటీఆర్ పై మరో సంచలన ట్వీట్ చేసింది. తనకు కేటీఆర్ అంటే ఎంతో ఇష్టమని, అతను ఒప్పుకుంటే క్యాండిల్ లైట్ డిన్నర్ ఇవ్వటానికి రెడీ అని అంటోంది శ్రీ రెడ్డి.

loader