Asianet News TeluguAsianet News Telugu

'సాహో' ప్రీమియర్ షో కలెక్షన్స్.. 'అజ్ఞాతవాసి' కంటే తక్కువ!

'సాహో' ప్రీమియర్ షోల ద్వారా మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని భావించారు. కానీ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా 9,15,224 డాలర్లు మాత్రమే రాబట్టింది.  డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయడంతో ఈ వసూళ్లు చూసి షాక్ అవుతున్నారట.

saaho movie us premier show collections
Author
Hyderabad, First Published Aug 31, 2019, 10:08 AM IST

భారీ అంచనాల మధ్య శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సాహో' సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా మీద అంచనాలు పెరిగిపోవడంతో దర్శకుడు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే సినిమాపై ఏర్పడిన బజ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేశారు.

ప్రీమియర్ షోల  ద్వారా మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని భావించారు. కానీ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా 9,15,224 డాలర్లు మాత్రమే రాబట్టింది.  డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయడంతో ఈ వసూళ్లు చూసి షాక్ అవుతున్నారట.

అమెరికాలో ప్రీమియర్‌ వసూళ్ల పరంగా 'సాహో' ఆరో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ప్రీమియర్స్‌లో 'బాహుబలి 2' 2.4 మిలియన్‌ డాలర్లు, 'అజ్ఞాతవాసి' 1.52 మిలియన్‌ డాలర్లు, 'బాహుబలి' 1.39 మిలియన్‌ డాలర్లు, 'ఖైదీ నంబర్‌ 150' 1.29 మిలియన్‌ డాలర్లు, 'స్పైడర్‌' 1.00 మిలియన్‌ డాలర్లు రాబట్టగా.. 'సాహో' 915 వేల డాలర్లతో ఆరో స్థానంలో నిలిచింది.

దీని తర్వాత 'భరత్‌ అనే నేను' 850 వేల డాలర్లు, 'అరవింద సమేత' 789 వేల డాలర్లు, 'రంగస్థలం' 725 వేల డాలర్లు, 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' 616 వేల డాలర్లు రాబట్టి తర్వాతి ఐదు స్థానాల్లోఉన్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. యువి క్రియేషన్స్ దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందించారు. 

'సాహో' తొలిరోజు ఎంత వస్తుందంటే..?

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ట్విట్టర్ రివ్యూ..!

'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

'సాహో' థియేటర్ వద్ద విషాదం.. వ్యక్తి మృతి! 

సాహో, సైరా లెక్కలు బాగానే ఉంటాయి.. కానీ!

ప్రభాస్ గురించి తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ గొడవ

'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

తెలంగాణాలో 'సాహో' ప్రీమియర్లు.. కష్టమే! 

సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!

Follow Us:
Download App:
  • android
  • ios