జై లవకుశ సక్సెస్ తో స్టార్ హిరోయిన్ స్టేటస్ పొందిన రాశిఖన్నా జై లవకుశ ముందు వరకు అటూ ఇటుగా రాశి ఖన్నా కెరీర్ తాజాగా సుప్రీమ్ లో ఛాన్సిచ్చిన అనిల్ రావిపూడి కోసం ఫ్రీగా రాశి ఐటమ్

సినీపరిశ్రమకు చెందిన చాలామంది ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత... తమకు కెరీర్‌‌లో బ్రేక్‌ ఇచ్చిన వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వరు అనే టాక్ సహజంగా వినిపిస్తూ వుంటుంది. అయితే ఈ అభిప్రాయాన్ని చెడిపేస్తూ ఓ అందాల రాశి ఉన్నతమైన నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలుస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇంతకీ ఆ అందాల రాశి ఎవరో కాదు. రాశీ ఖన్నా. రాశి ఈ మధ్య తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడామెని రియల్ హీరోయిన్‌ని చేసింది. పెద్దగా హిట్స్ లేకపోవడంతో తన కెరీర్‌ రిస్కులో పడిపోతోందేమోనని భయపడడుతున్న సమయంలోనే సుప్రీమ్‌ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన హీరోయిన్‌ రోల్ ఆఫర్ చేశాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. దీంతో అతనికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం రాగానే చక్కగా సద్వినియోగం చేసుకుంది రాశి.



సుప్రీమ్ సినిమాలో అవకాశం ఇచ్చాడనే కృతజ్ఞత భావంతో అనిల్ రావిపుడి తర్వాతి సినిమాలో ఏకంగా ఓ ఐటంసాంగ్‌నే ఉచితంగా చేసిపెట్టిందట రాశీఖన్నా. వాస్తవానికి రాశీఖన్నా ఇంతకు ముందెప్పుడూ ఐటెంసాంగ్స్‌లో స్టెప్పేయలేదు. కానీ మొదటిసారిగా అనిల్ రావిపూడి కోసం ఆమె ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా వెనుకాడలేదట. అన్నింటికిమించి ఆ పాట కోసం ఆమె రూపాయి కూడా చార్జ్ చేయకపోవడం మరో విశేషం. అనిల్ రావిపూడికి కృతజ్ఞతాభావంతో రాశి ఖన్నా చేసిపెట్టిన ఐటంసాంగ్ కారణంగా ఆ చిత్ర నిర్మాతకు సైతం ఆమెకి ఇచ్చే పారితోషికం రూపంలో భారీగానే మిగిలింది.