Asianet News TeluguAsianet News Telugu

వర్మా... ఇక ఆపెయ్: రాధికా ఆప్టే

  • తనతో అసభ్యంగా ప్రవర్తించిన దక్షిణాది హీరో చెంప చెళ్లుమనిపించా అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన రాధికా ఆప్టే.
  • ఈ సారి వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కామెంట్స్ చేసింది

 

radhika apte rgv should retir

నతో అసభ్యంగా ప్రవర్తించిన దక్షిణాది హీరో చెంప చెళ్లుమనిపించా అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన రాధికా ఆప్టే.. ఈ సారి వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉందంటూ గతంలో కామెంట్స్ చేసిన ఆప్టే.. ఎప్పుడు నోరు విప్పినా ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. అయితే, వివాదాలను ఇంటి పేరుగా మార్చుకున్న వర్మపై ఆమె కామెంట్స్ చేసిందటే, దేని గురించై ఉంటుందనే ప్రశ్నలు బుర్రలో మెదలడం సాధారణమే.

రాధికా ఆప్టేను టాలీవుడ్‌కు పరిచయం చేసింది రామ్ గోపాల్ వర్మాయే. ‘రక్త చరిత్ర’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ఆమెకు టాలీవుడ్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. రాధికా ఆప్టే ఇటీవల నేహా దూపియా టాక్ షోలో పాల్గొంది. ‘‘ఏ నటుడు లేదా డైరెక్టర్ రిటైర్ అయితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?’’ అని నేహా దూపియా అడిగిన ప్రశ్నకు రాధికా వెంటనే ‘రామ్ గోపాల్ వర్మ’ అని సమాధానం ఇచ్చింది.

ఆ సమాధానానికి అంతా ఆమెను ఆశ్చర్యంగా చూశారు. ఆర్జీవీ ఎందుకు రిటైర్ కావాలనే మరో ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఎందుకంటే ఆర్జీవీ ఇప్పటికే ఎన్నో అసాధారణ చిత్రాలు చేశారు కాబట్టి’’ అంటూ వివరణ ఇచ్చింది. దీంతో, రాధికాకు, ఆర్జీవికి మంచి సంబంధాలే ఉన్నాయని సినీ ప్రేక్షకులు ఓ అభిప్రాయానికి వచ్చేశారు.

అయితే, ఆర్జీవీ.. తనకు రాధికా ఆప్టే అంటే చాలా ఇష్టమని ఇదివరకే చెప్పారు. శ్రీదేవి తర్వాత అమితంగా ఇష్టపడే హీరోయిన్ ఆమేనన్నారు. ‘‘రాధికా నువ్వు ఇలా ప్రతికారం తీర్చుకుంటుంటే మా లాంటి పేద పురుషులు ఏమైపోవాలి? నా మూడు జన్మల్లో ఇంత హాటైన అందాన్ని నిన్నే చూస్తున్నా’’ అని గతంలో ఆమె ఫోటోలను పోస్ట్ చేసి మరీ ఆర్జీవీ ట్వీట్ చేయడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios