సిల్వర్ స్క్రీన్ కు దూరమైనప్పటికీ సోషల్ మీడియా పుణ్యమా అని ఫాన్స్ కి అత్యంత దగ్గర్లో ఉంటారు కొందరు సెలెబ్రిటీలు. అలాంటి వారిలో ఒకరే ప్రణీత సుభాష్. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో మెరిసిన ఈ కర్ణాటక భామ పెద్దగా క్లిక్ అవ్వకపోయినా కన్నడ ఆఫర్లు బాగానే అందుకుంటోంది. 

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసి నెటీజన్లను సంతోషపరిచే ప్రణీత ఈమధ్యనే పెట్టిన ఒక ఫొటోతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఫోటో చోసి ఆశ్చర్య పడటానికి ఏముంది అనుకుంటున్నారా? మరి ఆమె బీచ్ పక్కనో వెకేషన్ కు వెళ్ళో దిగిన ఫోటో కాదు అది. బాత్ టబ్ లో దిగిన ఫోటో. ఆకాశం నుండి ఊడిపడ్డ అందగత్తెలాగా ఆమె తెల్లని దుస్తులతో క్లీవేజ్ అందాలను చూపిస్తూ కెమెరా వైపు చూసి నవ్వుతుంటే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.

తెలుగులో బ్రహ్మోత్సవం సినిమా తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించని బాపు బొమ్మ ప్రణీత - సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అందచందాలతో తెలుగు ఫ్యాన్స్ ను పలకరిస్తూనే ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ పైన కాకపోయినా కనీసం మొబైల్ స్క్రీన్ పైన అయినా కనిపిస్తున్నందుకు ఫాన్స్ కూడా ఖుష్ అవుతున్నారు లెండి..