Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీలో మహేశ్ బాబు, పోసాని వాగ్యుద్ధం

  • మహేష్ కొరటాల కాంబినేషన్ లో భరత్ అనునేను
  • ప్రస్థుతం అన్నపూర్ణ షూటింగ్ లో శరవేగంగా షూటింగ్
  • అసెంబ్లీ లో నిర్మించిన సెట్ లో పోసాని, మహేష్ లమధ్య సీన్స్  షూటింగ్
POSANI QUESTIONING SUPER STAR MAHESH BABU IN ASSEMBLY FOR

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఫస్ట్ టైం తమిళ్ బాక్స్ ఆఫీస్ పై మహేష్ డైరెక్ట్ ఎటాక్ చేయబోతున్నాడు. ఇక స్పైడర్ తర్వాత కొరటాలల శివ దర్శకత్వంలో భరత్ అను నేను చిత్రంలో నటిస్తున్నాడు మహేష్. ఈ మూవీ షూటింగ్ ప్రస్థుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా జరుగుతోంది.

 

రాజకీయ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సీఎం గా కనిపించబోతున్నారు. శ్రీమంతుడు తర్వాత వీరి కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఆ సెట్ లో పోసాని ఎదో పరధ్యానంలో వెరైటీగా ఉన్నట్లు తెలుస్తోంది. . దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో అసెంబ్లీ భవనాన్ని తలపించే విధంగా వేసిన ఈ సెట్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు సుమారు 40 రోజులపాటు షూట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆయన పక్కన జీవా- బెనర్జీ లు కూడా ఇందులో కనిపిస్తున్నారు. పోసాని  పాత్ర ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోందని సమాచారం.

 

మొదటి సారి తన గురువును బంధువును దర్శకుడు కొరటాల ఈ సినిమాలో చుపించాబోతున్నాడు. ‘నిన్ను నీవు తెలుసుకో’ అని రామకృష్ణ పరమహంస చెప్పిన మాటల స్పూర్తితో ఈ కథను అల్లినట్లు తెలుస్తోంది. కొరటాల.. పోసాని శిష్యుడే. ఆయన దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేశాడు. అలాగే పోసానికి దగ్గరి బంధువు కూడా.. ఇప్పటివరకు మూడు బాక్స్ ఆఫీస్ హిట్స్ తీసిన కొరటాల ఆ సినిమాల్లో పోసానికి ఏ పాత్ర ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మహేష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. మరి ఆ పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

 

అత్యంత వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సంక్రాంతికి రాబోతున్న సినిమాను టార్గెట్ చేస్తూ విడుదల చేయబోతున్నారు. ఈ ఫోటోలో పోసాని ప్రశ్నిస్తుంటే  పక్కన జీవా బెనర్జీ లు కూడా ఇందులో కనిపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios