బస్సు ప్రయాణంలో ఏం జరిగిందో ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు హీరో శ్రీరామ్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం `ఓం శాంతి ఓం`. తెలుగు, తమిళం బైలింగ్వల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెహమాన్‌ క్రియేటివ్‌ కమర్షియల్స్ సంస్థ నిర్మించింది. తాజాగా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది.

దీన్ని  తెలుగులో `ఊహించలేదు కదు` పేరుతో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో శ్రీరామ్‌ సరసన నీలమ్‌ ఉపాధ్యాయ నటించారు. బస్సు ప్రయాణంలో జరిగిన ప్రమాదం, హీరో ఒక్కడే బతికి ఉండటం, ఆపై జరిగిన పరిణామాల సమాహారమే ఈ చిత్రమని చిత్ర బృందం చెబుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మరి ఈ సినిమాతో శ్రీరామ్‌ పూర్వవైభవాన్ని పొందుతాడా? అన్నది చూడాలి.