సమ్మర్ హాలీడేస్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఎన్నికలను కూడా లెక్క చేయకుండా.. మే 10న (Prathinidhi 2 New Release Date) ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

హీరో నారా రోహిత్ (Nara Rohit) ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ అబిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉంది. అప్పటి నుండి చాలాసార్లు విడుదల తేదీలు మారుతూ వచ్చాయి. మొత్తానికి ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ సినిమా ఎన్నికలకు మూడు రోజుల ముందు థియేటర్లలోకి వస్తోంది. అంటే మే 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు (Murthy Devagupthapu) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సమ్మర్ హాలీడేస్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఎన్నికలను కూడా లెక్క చేయకుండా.. మే 10న (Prathinidhi 2 New Release Date) ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్‌, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. హీరో, దర్శకుడు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి ఈ సినిమా వ్యతిరేకం కాదని, వ్యవస్థలో ఉన్న లోపాన్ని ప్రశ్నించి.. దానికి సరైన జవాబు చూపించేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.

 గతంలో గ్రాండ్ సక్సెస్ అయిన ‘ప్రతినిధి’ సిరీస్ నుండి వస్తోన్న రెండవ ఫ్రాంచైజీ ‘ప్రతినిధి 2’. ఇందులో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు. సిరీ లెల్లా (Siree Lella) కథానాయికగా నటిస్తుండగా.. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. (Prathinidhi 2 Movie Ready to Release). వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తో కలిసి సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.