MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆర్‌.నారాయణమూర్తికి జగన్‌ ఝలక్‌ ఇచ్చారా?! అసలేం జరిగింది

ఆర్‌.నారాయణమూర్తికి జగన్‌ ఝలక్‌ ఇచ్చారా?! అసలేం జరిగింది

 సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్‌.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. 

3 Min read
Surya Prakash
Published : May 06 2024, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110


ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి..  గురించి ప్రత్యేకంగా చెయ్యాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద నిలిపించిన పీపుల్స్ స్టార్. గా ఆయనకు చాలా పేరుంది. నిత్యం  పేదలపై జరుగుతున్న అన్యాయాలకు స్పందిస్తూ ...తన సినిమాలో చూపిస్తూంటారు.  వెండితెర మీద ప్రజా పోరాటాన్ని చూపిస్తున్న ప్రజల స్టార్ గా ఆయన్ని జనం మర్చిపోరు. నలభై ఏళ్లు పైగా  ఇండస్ట్రీలో ఉన్నా.. అక్కడ పోకడలను పట్టించుకోకుండా, సినిమా సంస్కృతిని ఒంటపట్టించుకోని ముక్కుసూటి మనిషి.  

210


చేతిలో రూపాయి లేకుండానే నిర్మాతా, దర్శకుడిగా మొదటి సినిమా నిర్మించిన  పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి.   మొదటి సారిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ సినిమాలో నారాయణమూర్తి నటించారు. ఈయన పూర్తి పేరు రెడ్డి నారాయణ మూర్తి.సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు తన గురువు అని చెప్పుకుంటూ ఉంటారు నారాయణ మూర్తి.

310


ఆర్. నారాయణ మూర్తి తాను అనుకున్నవామపక్ష సిద్దాంతాలను తెరమీదకు తీసుకురావాలంటే .. తానే హీరో కావాలనుకున్నాడు. కానీ హీరో అవకాశాలు ఎవ్వరు ఇవ్వలేదు. అందుకు తానే డైరెక్టర్‌గా మారితే తన సినిమాను తానే తీయోచ్చు అని ప్రస్దానం మొదలెట్టారు.  తన కథలకు నిర్మాత దొరక్కపోవడంతో తానే ప్రొడ్యూసర్‌గా కూడా మారాడు. అయితే జేబులో డబ్బులు లేకుండానే నిర్మాత అయ్యారు. తన స్నేహితులు ఇచ్చిన డబ్బుతో 1984లో స్నేహ చిత్ర పిక్చర్ బ్యానర్ ని స్థాపించి.. ‘అర్థరాత్రి స్వాతంత్య్రం’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆయన ప్రస్దానం మనకు తెలిసిందే.

410
R Narayana Murthy

R Narayana Murthy


ఇలా సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్‌.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఝలక్‌ ఇచ్చారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు ఏం జరిగింది.

510


ఆర్ నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లాలోని మల్లంపేటలో  ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు.  తాను పుట్టిన ప్రాంతంపై ప్రేమతో సాగునీటి ప్రాజెక్టు కోసం జగన్‌ అధికారంలోకి వచ్చాక నారాయణమూర్తి ఆయన్ను కలిశారు. ఆ ప్రాజెక్టు సాధించడం తన చిరకాల స్వప్నమని వివరించారు. ఆ ప్రాజెక్టుని జగన్‌ మంజూరు చేశారు. 

610

ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'స్వాతంత్యం సిద్ధించి 75 ఏళ్లు దాటినా.. మన కాళ్ల కిందే ఏలేరు నీళ్లు పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి మనది. ఇలాంటి పరిస్థితుల్లో నేను(ఆర్‌ నారాయణమూర్తి),  మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గతంలో సీఎం జగన్‌ గారిని తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి విజ్ఞప్తి చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఆ మహానుభావుడు ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాండవ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు సెల్యూట్‌' అంటూ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు.  

710


అంతటి ముఖ్యమంత్రే మంజూరు చేశాక ఇంకేముంది.. త్వరలోనే ప్రాజెక్టు పూర్తయిపోతుందనుకున్నారు. ఆయనకు చేతులెత్తి మొక్కారు. జగన్‌ దేవుడని, ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కొనియాడారు. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పటికీ కాగితాలపైనే ఉంది. 
 

810
r.narayana murthy met cm ys jagan

r.narayana murthy met cm ys jagan

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరు, ఉమ్మడి విశాఖ జిల్లాలోని తాండవ జలాశయాల కాలువల్ని అనుసంధానిస్తే.. రెండు ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 2021లో ఆ ప్రాజెక్టుకి ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసింది. 2021 మార్చి 19న పాలనాపరమైన అనుమతులిచ్చింది. టెండర్లు పిలిచి.. గుత్తేదారుడినీ ఎంపిక చేశారు. ఆ తర్వాత దానికీ రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టుల గతే పట్టింది. ప్రాజెక్టు మంజూరు చేసి మూడేళ్లవుతున్నా.. అంగుళం కూడా ముందుకి కదల్లేదు అంటూ ఇప్పుడు ఎలక్షన్స్ వేళ కథనాలు మొదలయ్యాయి.   ఈవిషయమై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

910
R.narayana murthy

R.narayana murthy

సాయుధ తెలంగాణ పోరాట చరిత్రను ఆధారం చేసుకొని.. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెరమీదకు ఎక్కించిన సినిమా ‘వీర తెలంగాణ’. తెలంగాణ ఉద్యమాన్ని తెరకెక్కించిన సినిమా ‘పోరు తెలంగాణ’. ఈ సినిమాలతో ఆయన ఈ ప్రాంతంలో మరింత ఆదరణ పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేరే సినిమాల్లో భారీ ఆఫర్లు వచ్చినా..వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించి నమ్మిన సిద్దాంతమే ముఖ్యమనుకున్న అసలు సిసలు కథానాయకుడు ఆర్.నారాయణ మూర్తి. ఆయన తన సినీ ప్రయణంలో అనేక హిట్స్, కొన్ని ప్లాప్‌లను చూసినా.. ఆయన ఏనాడు బాధపడలేదు. 

1010

క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేరే సినిమాల్లో భారీ ఆఫర్లు వచ్చినా..వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించి నమ్మిన సిద్దాంతమే ముఖ్యమనుకున్న అసలు సిసలు కథానాయకుడు ఆర్.నారాయణ మూర్తి. ఆయన తన సినీ ప్రయణంలో అనేక హిట్స్, కొన్ని ప్లాప్‌లను చూసినా.. ఆయన ఏనాడు బాధపడలేదు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved