Asianet News TeluguAsianet News Telugu

గుర్రంపై అల్లూరి.. బుల్లెట్‌పై భీమ్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్ట్.. మళ్ళీ పోస్ట్ పోన్‌..

ఎన్నో రోజులుగా వెయిట్‌ చేస్తున్న రోజు రానే వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో, ఆకాశాన్ని దాటుకున్న అంచనాలతో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు. 

ntr ram charan starrer rrr shooting resume arj
Author
Hyderabad, First Published Oct 6, 2020, 11:02 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అల్లూరి సీతారామరాజు గుర్రం ఎక్కాడు.. కొమురంభీమ్‌ బుల్లెట్‌ ఎక్కాడు.. ఇద్దరు కలిసి కదన రంగంలోకి దిగారు. జక్కన్న యాక్షన్‌ అంటూ యుద్ధాన్ని మొదలు పెట్టాడు. ఇక కదనం రంగం దుమ్ము లేచిపోవాల్సిందేనా?.. బాక్సాఫీస్‌ బద్దలైపోవాల్సిందేనా? అంటే అవుననే అనిపిస్తుంది. 

ఎన్నో రోజులుగా వెయిట్‌ చేస్తున్న రోజు రానే వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో, ఆకాశాన్ని దాటుకున్న అంచనాలతో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు. 

ఈ విషయాన్ని `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో షూటింగ్‌ రిజ్యూమ్‌ అయ్యే క్రమంలో లోకేషన్‌ని, కాస్ట్యూమ్స్ ని, పాత తుపాకులను, వాహనాలను దుమ్ముదులిపి రెడీ చేస్తున్నారు. కెమెరా లెన్స్ లు సరిచేశారు.

రాజమౌళి యాక్షన్‌ అనగా, గుర్రంపై అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్‌, బుల్లెట్‌ బైక్‌పై కొమురం భీమ్‌ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ ఒకేసారి సెట్‌లోకి రావడం గుస్‌బమ్స్ ని తెప్పిస్తుంది.

కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో సినిమా చిత్రీకరణ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచమే లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. కరోనా విజృంభించడం వల్ల దాదాపు ఆరు నెలలు షూటింగ్‌ని నిలిపివేశారు. కేంద్రం అనుమతులతో కరోనాకి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ స్టార్ట్ చేశారు. 

ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఆ మధ్య ప్రకటించారు. కానీ దాన్ని అక్టోబర్‌ 22కి మార్చారు. ఇప్పటికి ఇది మూడోసారి వాయిదా వేయడం. మొదట జులై 30న ప్రకటించారు. ఆ తర్వాత వచ్చ ఏడాది సంక్రాంతి అన్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది దసరాకి మార్చారు. 

లాక్‌డౌన్‌ టైమ్‌లోనే అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్‌ పాత్ర టీజర్‌ని విడుదల చేయగా, దానికి విశేష స్పందన లభించింది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. ఎన్టీఆర్‌ నటిస్తున్న కొమురం భీమ్‌ పాత్రని విడుదల చేయలేదు. ఆయనపై షూట్‌ చేయాల్సి ఉంది. త్వరలోనే ఆ టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందంతోపాటు రామ్‌చరణ్‌ తెలిపారు.అందుకు ప్రామిస్‌ కూడా చేయడం విశేషం. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌, బ్రిటీష్‌ నటి ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతుండగా, పది భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios