Asianet News TeluguAsianet News Telugu

కళ్యాణ్ రామ్, విజయశాంతి నటిస్తున్న చిత్ర షూటింగ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 4 కోట్ల నష్టం ?

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర సెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సిబిఐ కి సంబందించిన సన్నివేశాలు కీలకం కాబోతున్నాయట. దీనితో ప్రత్యేకంగా సిబిఐ ఆఫీస్ సెట్ ని నిర్మించారు.

fire accident at nandamuri kalyan ram movie shooting dtr
Author
First Published May 9, 2024, 9:56 PM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్  చివరగా నటించిన చిత్రం డెవిల్. కళ్యాణ్ రామ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. కథ పరంగా మంచి ప్రయత్నమే అని చెప్పాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం విజయం సాధించలేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. 

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని నిర్మిస్తూనే కళ్యాణ్ రామ్ తాను హీరోగా ఈ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండడం ఆసక్తిగా మారింది. విజయశాంతి ఏ చిత్రానికి అంత సులభంగా అంగీకరించరు. 

కళ్యాణ్ రామ్ చిత్రానికి అంగీకరించారు అంటే.. ఏదో బలమైన కథాంశమే ఉండాలి అని అంతా అంచనా వేస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో విజయశాంతి పాత్రలో ఆమె సూపర్ హిట్ చిత్రం కర్తవ్యం లక్షణాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్ర సెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సిబిఐ కి సంబందించిన సన్నివేశాలు కీలకం కాబోతున్నాయట. దీనితో ప్రత్యేకంగా సిబిఐ ఆఫీస్ సెట్ ని నిర్మించారు. పది రోజుల పాటు ఈ సెట్ లో షూటింగ్ జరగాల్సి ఉంది. సిబిఐ కి సంబందించిన సన్నివేశాలు దాదాపు గా పూర్తయ్యాయట. ఇక కొంత భాగం మాత్రమే పెండింగ్ ఉంది. 

ఇటీవల చిత్ర యూనిట్ షూటింగ్ పూర్తి చేసుకుని సెట్ నుంచి వెళ్లిపోయారట. రాత్రి 8 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం గుర్తించి చిత్ర యూనిట్ కి సమాచారం అందించే లోపు అంతా కాలి బూడిదైపోయింది. చిత్ర యూనిట్ వెళ్లినా ఫలితం లేకపోయిందట. సెట్ కాలిపోవడం వల్ల నిర్మాతకి సుమారు 4 కోట్ల నష్టం అని అంచనా వేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం తెలియరాలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios