Asianet News TeluguAsianet News Telugu

నితిన్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌! ఎప్పుడు.. ఎక్కడంటే?

నితిన్‌ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నితిన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి పనులు ప్రారంభించాడు. భీష్మ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న నితిన్, వెంటనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దుబాయ్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో పెళ్లి పనులకు బ్రేక్‌ పడింది. 

Nithiin Wedding Location Changed To Hyderabad
Author
Hyderabad, First Published Jun 28, 2020, 10:25 AM IST

కరోనా సినిమాల మీదే కాదు సినీ తారల జీవితాల మీద కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. కరోనా ప్రభావానికి ముందు పెళ్లి పనులు ప్రారంభించిన తారలు కరోనా దెబ్బకు వాయిదా వేసుకున్నారు. కొంత మంది వెయిట్ చేయలేక లాక్‌ డౌన్‌ కాలంలోనే పెళ్లిళ్లు చేసేసుకున్నారు. నిఖిల్‌ లాక్‌ డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకున్నాడు. దిల్ రాజు కూడా లాక్‌ డౌన్‌ సమయంలోనే పెళ్లి చేసుకున్నాడు.

తాజాగా నితిన్‌ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నితిన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి పనులు ప్రారంభించాడు. భీష్మ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న నితిన్, వెంటనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దుబాయ్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో పెళ్లి పనులకు బ్రేక్‌ పడింది. ముందు నిబంధనలు సడలించిన తరువాత దుబాయ్‌లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నితిన్‌.

కానీ పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే పరిస్థితి కనిపించకపోవటంతో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. జూలైలో నితిన్‌, షాలినీల పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఫాం హైస్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారట. ఇప్పటికే కుటుంబ సభ్యులు పెళ్లి పనులు ప్రారంభిచారట, త్వరలోనే పెళ్లి డేట్‌, ముహూర్తం, వేదికలను అధికారికంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios