ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. 

నితిన్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. గత ఏడాది నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రారంభం అయి చాలా కాలమే అవుతున్నా ఇంతవరకు సాలిడ్ అప్డేట్ రాలేదు. టైటిల్, ఫస్ట్ లుక్ లాంటి హంగామా జరగలేదు. ఎట్టకేలకు ఆ సందర్భం వచ్చేసింది. నితిన్, వక్కంతం వంశీ చిత్ర టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అంతే కాదు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.

ఈ చిత్రానికి 'ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఎక్స్ట్రా అనేది టైటిల్ కాగా ఆర్డినరీ మాన్ అనేది క్యాప్షన్. టైటిల్ ఆసక్తికరంగా ట్రెండీగా ఉంది. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే నితిన్ లుక్ షాకింగ్ అనే చెప్పాలి. పోస్టర్ లో నితిన్ రెండు విభిన్న లుక్స్ లో కనిపిస్తున్నాడు. 

ఓ లుక్ లో నితిన్ లాంగ్ బియర్డ్ తో సీరియస్ గా కనిపిస్తుండగా మరో లుక్ లో స్టైలిష్ గా గాలికి తిరిగే కుర్రాడిలా కనిపిస్తున్నాడు. అంటే నితిన్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడా లేక ఒకే పాత్రలో ఇలా రెండు గెటప్స్ లో కనిపిస్తాడా అనే క్యూరియాసిటీ మొదలైంది. 

Scroll to load tweet…

ప్రతి ఆర్డినరీ మ్యాన్ వెనుక ఎక్ట్రార్డినరీ స్టోరీ ఉంటుంది అంటూ నితిన్ సోషల్ మీడియాలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్ట్ చేశారు. నితిన్ లుక్ కి, ఫస్ట్ లుక్ డిజైన్, టైటిల్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నితిన్ ఈసారి గట్టి ప్రయత్నమే చేయబోతున్నట్లు అర్థం అవుతోంది. ఇక ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీమ్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ లో నిర్మిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. హ్యారిస్ జైరాజ్ సంగీత దర్శకుడు.