'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తరువాత 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించింది. 

'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తరువాత 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకి సక్సెస్ ని తీసుకురాలేకపోయాయి. అయినప్పటికీ ఈమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రస్తుతం పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తోంది. ఇటీవల వారణాసి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే నిధి అగర్వాల్ తన పాస్ పోర్ట్ ని పోగొట్టుకోవడంతో ఫారిన్ షెడ్యూల్ పై అనుమానాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే మే లో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికి అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడు మరింత ఆలస్యమవుతుందని అనుకున్నారు. అయితే నిధి తన కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం కాకూడదని పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించి పాస్ పోర్ట్ తిరిగి పొందారు.

దీంతో అనుకున్న సమయానికి సినిమా షెడ్యూల్ ని ప్రారంభించనున్నారట. రామ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నిధితో పాటు నభా నటేష్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది.