Asianet News TeluguAsianet News Telugu

Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మికీ మాటిచ్చిన విక్రమ్.. తులసికి నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన నందు?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 20 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

Nandu gifts a necklace to tulasi in todays intinti Gruhalakshmi serial gnr
Author
First Published Mar 20, 2023, 8:55 AM IST

ఈరోజు ఎపిసోడ్లో బసవయ్య విక్రమ్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ కాదన్నంత పని చేస్తున్నావు, వింటాను అంటూనే విననంత పని చేస్తున్నావు అని అంటాడు. కొత్త కొత్తగా ప్రవర్తిస్తున్నావు ఇదంతా మీ అమ్మ బయటకు చెప్పుకోలేకపోతోంది కడుపులో దాచుకొని బాధపడుతోంది అంటూ ఓవరాక్షన్ చేస్తూ మాట్లాడతాడు బసవయ్య. సర్లే ప్రసూనాంబ మనం వెళ్దాం పద మనం వచ్చిన పని అయిపోయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బసవయ్య. అప్పుడు విక్రమ్ రాజ్యలక్ష్మి నీ గుడ్డిగా నమ్ముతూ మామయ్య అన్న మాట నిజమేనా అమ్మ నేను ఏదైనా తప్పు చేస్తే నా ముఖం మీద అడిగి హక్కు నీకు ఉంది.

మధ్యలో ఎవరి పెద్దరికం అవసరం లేదు అయినా ఆ పెళ్లి సంబంధం కావాలని చెడగొట్టే లేదమ్మా అనడంతో జరిగిన వాటి గురించి అనవసరంగా మాట్లాడకూడదు నాన్న అని అంటుంది. నా పెళ్లి గురించి పక్కన పెట్టి తమ్ముడికి పెళ్లి చేయమ్మా అనడంతో రాజ్యలక్ష్మి తెలివిగా అలా చేయకూడదు నాన్న అలా జరగదు సవతి తల్లి కాబట్టి నేను పట్టించుకోలేదు అని నలుగురు నానా మాటలు అంటారు అని అంటుంది. ఎవరు ఏమైనా అనని పట్టించుకోను మీ తమ్ముడు పెళ్లి గురించి నేను వదిలేసాను ముందు నీ పెళ్లి చేశాకే తమ్ముడు పెళ్లి చేస్తాను అని దొంగ కన్నీరు కారుస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి. ఇలా పస్తులు ఉండద్దమ్మా ఉంది నీ ఆరోగ్యం బాగోలేదు ఈ పండైనా తినమ్మ ఆడడంతో వద్దు నాన్న నన్ను వదిలేయి అని దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది రాజ్యలక్ష్మి.

అప్పుడు విక్రమ్ రాజ్యలక్ష్మి మాటలు నిజమని నమ్మి సరే అమ్మ నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అప్పుడు రాజ్యలక్ష్మి లోలోపల నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత విక్రమ్ దివ్యని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత నందు, తులసి పెళ్లి రోజు సందర్భంగా సెలబ్రేషన్స్ అన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉండగా అది చూసి లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు తులసి అనసూయతో అనవసరంగా నటించడానికి ఒప్పుకున్నాను ఒక్క క్షణం ఒక్కొక్క యోగంలో గడుస్తోంది నేను వెళ్లి నిజం చెప్పేస్తాను అత్తయ్య అనగా నువ్వు అసలు ఇలా నటించడానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది తులసి అని అంటుంది అనసూయ.

నిజంగా నాకు ఈ పెళ్లి రోజు చేసుకునే ఉద్దేశం లేదు నాన్న అనడంతో తొందరపడి నిజం చెప్పేయకు నందు లాస్య మళ్లీ నీకు చుక్కలు చూపిస్తుంది ఏది జరగాలంటే అది జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు అని పరంధామయ్య ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇంతలో దివ్య అక్కడికి వచ్చి హడావిడి చేస్తూ ఉండగా ఎందుకమ్మా దివ్య ఇవన్నీ అనడంతో మళ్లీ మళ్లీ ఇటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో రాదో అని అంటుంది దివ్య. అప్పుడు దివ్య పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఇలా వస్తే కేక్ కట్ చేద్దాం ఆడడంతో వెంటనే లాస్య పెళ్ళికొడుకు ముఖంలో ఎప్పుడూ లేనంత సంతోషం కనిపిస్తోంది అనగా మొగుడికి విడాకులు ఇచ్చిన నీకు అలాంటివీ కానీ కనిపిస్తాయి లే అని అంటాడు వాసుదేవ్.

అప్పుడు నందు తులసి ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తూ ఉండగా అంత గట్టిగా చేయి పట్టుకోవాల్సిన అవసరం లేదు తులసి అని అంటుంది లాస్య. అదే నందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అని అంటుంది. తర్వాత తులసి నందు ఇద్దరు కేక్ కట్ చేయడానికి ఇబ్బంది పడుతుండగా కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోండి అని వాసుదేవ్ అనడంతో లాస్య షాక్ అవుతుంది. వాళ్ళిద్దరూ కేక్ తినిపించుకుంటుండగా అది చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు కేకు మాత్రమే ఏదైనా గిఫ్ట్ తెచ్చావా అని వాసుదేవ్ అడగగా ఆయన ఇప్పటికిప్పుడు అంటే ఏం గిఫ్ట్ తెస్తారు అని అంటుంది లాస్య.

అప్పుడు అందరి ముందు నందు తులసి కోసం డైమండ్ నెక్లెస్ తీసి ఇవ్వడంతో అది చూసి లాస్య షాక్ అవుతుంది. అప్పుడు ఆ నెక్లెస్ ని చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు. తులసి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు పనిమనిషి రాములమ్మ నందు బాబు మన లాస్యమ్మకి ఇచ్చిన నెక్లెస్ కంటే ఇది చాలా బాగుంది అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు నందు అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు. అప్పుడు నందు నెక్లెస్ వెయ్యబోతుండగా ఒక్క నిమిషం తులసి నేను పెడతాను అని లాస్య నెక్లెస్ వేయడానికి వెళ్లి నందు ,తులసికి వార్నింగ్ ఇస్తూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది.

అప్పుడు లాస్య మాటలకు తులసి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు నందు తాను చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మాట్లాడుతాడు. అప్పుడు నందు మాటలకు తులసి అక్కడున్న వారందరూ బాధపడుతూ ఉండగా లాస్య ఆశ్చర్యపోతుంది. భార్యాభర్తల బంధం గురించి గొప్పగా చెబుతూనే మధ్యలో లాస్యని ఇన్వాల్వ్ చేస్తూ లాస్య మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు నందు. అందుకే ఇప్పుడు ఏం చేయలేని సహాయం స్థితిలో ఉన్నాను కాబట్టి క్షమించమని అడగడం తప్ప నేను ఏమి చేయలేను అని చేతులు జోడించి అడుగుతాడు నందు.

ఆ తర్వాత తులసి కూడా నందు చేసిన మోసాన్ని తలుచుకొని బాధతో మాట్లాడుతూ ఉండగా నందు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు తులసి బాధతో మాట్లాడుతూ నేను ప్రతి ఒక్కరినీ కోరుకునేది ఒకటే నమ్మిన వారిని మోసం చేయకండి అనడంతో నందు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత విక్రమ్ దివ్య ఫోటో చూసి సంతోష పడుతూ ఉండగా ఇంతలో దేవుడు అక్కడికి కుంటుకుంటూ తిప్పలు పడుతూ వస్తాడు. అప్పుడు దేవుడు విక్రమ్ చుట్టూ తిరుగుతూ ఎన్ని మాటలు మాట్లాడినా పాటలు పాడిన కూడా విక్రమ్ పట్టించుకోకుండా దివ్య ఫోటో వైపు అలాగే చూస్తూ ఉంటాడు. పెళ్లయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందో అనగా కొడితే ముఖం పచ్చడి అవుతుంది. దివ్య నాది అనడంతో అదే మాట వెళ్లి పెద్దమ్మతో చెప్పండి అని అంటాడు దేవుడు. నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటానమ్మ అంటూ పెద్దమ్మకీ గంగిరెద్దులాగా అక్కడ తల ఊపావు కదా అని అంటాడు.

Follow Us:
Download App:
  • android
  • ios