Asianet News TeluguAsianet News Telugu

ఆపని చేయాలంటే చాలా టెన్షన్ అంటున్న కల్యాణ్ రామ్, నిద్రకూడా పట్టదంటున్న నందమూరి హీరో

డైలాగ్, యాక్షన్, రొమాంన్స్, ఇలా ఏ విషయంలో అయినా దూసుకుపోతాను కాని.. ఒక్క విషయంలోనే టెన్షన్ వస్తుంది అంటున్నాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. నిద్రకూడా పట్టదంటున్నాడు. ఇంతకీ కల్యాణ్ రామ్ ను టెన్షన్ పెట్టే ఆ పనేంటో తెలుసా...? 

Nandamuri Kalyan Ram comments about His Dance in Amigo Movie
Author
First Published Feb 8, 2023, 1:26 PM IST


డిఫరెంట్ మూవీస్ తో నందమూరి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూ వెళ్తున్నాడు కల్యాణ్ రామ్. సెలక్ట్ చేసుకునే కథల విషయంలో తన మార్క్ చూపిస్తున్నాడు. ఈక్రమంలో కల్యాణ్ రామ్ నుంచి రాబోతున్న సినిమా అమిగోస్. ఈమూవీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందే. ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా  థియేటర్లను పలకరించబోతోంది మూవీ. ఈమూవీ ప్రీ రిలీజ్ వేడుగ రీసెంట్ గానే ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ ముఖ్యం అతిధిగా వచ్చారు. ఇక ఈమూవీ ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. 

ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సంస్థలతో మాట్లాడారు కల్యాణ్ రామ్. ఈ సందర్భంగా తనకు సబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు కల్యాణ్ రామ్. తాజా ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. మొదటి నుంచి కూడా నాకు డాన్సులు అంటే భయం .. ఒక రకమైన షివరింగ్ వచ్చేస్తుంది. డాన్సు చేయాలంటే రెండు మూడు రోజుల పాటు టెన్షన్ తో నిద్రపట్టదు. రిహార్సల్స్ అన్నా ..  వన్ మోర్ అన్నా అంతే టెన్షన్ గా ఉంటుంది. అలాంటి టెన్షన్ అమిగోస్ కు కూడా పడాల్సి వచ్చింది" అన్నాడు. 

ఇక ఆయన పడ్డ మరో ఇబ్బంది గురించి కూడా ఫన్నీగా చెప్పారు కల్యాణ్ రామ్.. ఎన్నో రాత్రులొస్తాయి పాట కోసం షర్టు తీయాలన్నారు .. అవసరం లేదండి అని చెబుతున్నా వినిపించుకోలేదు. ఆ పాటలో ఫిట్ నెస్ ఇంకా బాగా  కనిపించాలని ఎక్కువగా  కసరత్తులు కూడా చేయించారు .. వద్దనంగా షర్టు కూడా తీయించారు. అని చెప్పారు కల్యాన్ రామ్. 

ఇక ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి.. నా డాన్స్ ఇలా వర్కైట్ అవ్వడానికి  అవినాశ్ కొల్లా సెట్ తో పాటు .. శోభి మాస్టర్ గారి కొరియోగ్రఫీ వల్లే సాధ్యం అయ్యిందన్నారు. అందరి కృషితోనే ఆ పాట  మరింత అద్భుతంగా వచ్చింది అని  అన్నారు కల్యాణ్ రామ్.  ఇక ఈ సినిమాతో దర్శకుడిగా రాజేంద్ర పరిచయమవుతున్నాడు. గిబ్రాన్ సంగీతం అందించగా.. ఈ మూవీ సాంగ్స్ సినిమాకు స్పెషల్ కాబోతున్నాయి. కల్యాణ్ రామ్ జోడీగా ఈ సినిమాలో  ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios