Asianet News TeluguAsianet News Telugu

సిండికేట్‌గా మారబోతున్న నాగార్జున

 మహి వి రాఘవ ఓ స్క్రిప్ట్ ని నాగార్జునకి వివరించారట. నాగ్‌ లైన్‌ నచ్చి బౌండెడ్‌ స్క్రిప్ట్ చెప్పమని కోరారట. ప్రస్తుతం మహి దానిపై వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫమ్‌ అనే వార్తలొస్తున్నాయి.

nagarjuna next film with yatra director mahi v raghava name syndicate
Author
Hyderabad, First Published Sep 13, 2020, 2:07 PM IST

నాగార్జున దూకుడు పెంచుతున్నాడు. గతేడాది వరకు బ్యాక్‌ టూ బ్యాక్‌ పరాజయాలు పొందిన ఆయన ఇప్పుడు వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు లైన్‌లో పెట్టిన మన్మథుడు` నాగ్‌ తాజాగా మరో సినిమాకి కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. 

`ఆనందో బ్రహ్మా`, `యాత్ర` వంటి విజయవంతమైన సినిమాలను రూపొందించిన మహి వి రాఘవ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల లాక్‌డౌన్‌ టైమ్‌లో మహి వి రాఘవ ఓ స్క్రిప్ట్ ని నాగార్జునకి వివరించారట. నాగ్‌ లైన్‌ నచ్చి బౌండెడ్‌ స్క్రిప్ట్ చెప్పమని కోరారట. ప్రస్తుతం మహి దానిపై వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫమ్‌ అనే వార్తలొస్తున్నాయి. దీనికి `సిండికేట్‌` అనే టైటిల్‌ని అనుకుంటున్నారని, ఇది పీవీపీ బ్యానర్‌పై తెరకెక్కనుందని టాక్.

ప్రస్తుతం నాగార్జున `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్నారు. సాల్మన్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అన్ని అనుకున్నట్టు జరిగితే మహి రాఘవ సినిమా ఆ తర్వాత ఉండనుందని టాక్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios