చెన్నై అంటే పంజాబ్ ప్లేయ‌ర్ల‌కు పూన‌కాలే.. వ‌రుస‌గా ఐదోసారి సీఎస్కేను చిత్తుచేసిన పంజాబ్ కింగ్స్

CSK vs PBKS: ఐపీఎల్ 2024ను విజయంతో ప్రారంభించిన చెన్నై సూప‌ర్ కింగ్స్.. సీజన్ మధ్యలో తడబడుతూ ముందుకు సాగుతోంది.  చెపాక్ లో తిరుగులేని జ‌ట్టుగా ఉన్న చెన్నైని సొంత గ్రౌండ్ లో పంజాబ్ దెబ్బ‌కు ఈ సీజ‌న్ లో రెండో ఓట‌మిని చ‌విచూసింది.
 

Punjab Kings defeated CSK for the fifth time in a row CSK vs PBKS, IPL 2024 RMA

CSK vs PBKS : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ 49వ మ్యాచ్ చెపాక్‌లో జ‌ర‌గ్గా, ఇందులో చెన్నై సూప‌ర్ కింగ్, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై టీమ్ టాస్ ఓడింది. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ స్పిన్నర్లు ఆతిథ్య జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ త‌ర్వాత బ్యాటింగ్ లో రాణించి సొంత గ్రౌండ్ లో చెన్నైని చిత్తుగా ఓడించింది పంజాబ్. ఈ విజ‌యంతో పంజాబ్ జ‌ట్టు వ‌రుస‌గా ఐదోసారి చెన్నైని ఓడించింది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ను రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ లు త‌మ అద్భుత‌మైన బౌలింగ్ తో దెబ్బ‌కొట్టాడు. 4 ఎకానమీతో బౌలింగ్ చేసి చెన్నైని భారీ స్కోర్ చేయ‌కుండా క‌ట్ట‌డి చేశారు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో చెన్నై జట్టు స్కోరు బోర్డులో 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. 163 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్17.5 ఓవ‌ర్ల‌లోనే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ధీటుగా ఓపెనింగ్ చేసి త‌ర్వాత త‌డ‌బ‌డిన చెన్నై

తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ధీటుగా శుభారంభం చేసింది. కానీ 29 పరుగుల వద్ద ఓపెనర్ అజింక్య రహానే వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత పేలుడు ఆటగాడు శివమ్ దూబే, రవీంద్ర జడేజా 0, 2 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే, మ‌రో ఎండ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జ‌ట్టుకు మంచి స్కోర్ అందించే ఇన్నింగ్స్ ఆడ‌టం కోసం ప్ర‌య‌త్నించాడు. రుగురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో 48 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 62 పరుగులు సాధించాడు. సమీర్ రిజ్వీ 23 బంతుల్లో 21 పరుగులు, చివర్లో ధోనీ 1 సిక్స్, ఒక ఫోర్ సాయంతో 14 పరుగులు కొట్టారు. 

పంజాబ్ అద్భుత బౌలింగ్.. 

పంజాబ్ మ‌రోసారి అద్భుత బౌలింగ్ తో అద‌ర‌గొట్టింది. గ్రౌండ్ పొడి వాతావ‌ర‌ణాన్ని పంజాబ్ జ‌ట్టు సద్వినియోగం చేసుకుంది. పంజాబ్ బౌలింగ్ అటాక్ లో స్పిన్నర్లు కీల‌క పాత్ర పోషించారు. రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ 4 ఓవర్లలో 17, 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ తలో 1 వికెట్ తీశారు.

జానీ బెయిర్‌స్టో-రిలీ రోసోవ్ లు పంజాబ్ కు విజయాన్ని అందించారు..

పంజాబ్ బ్యాట్స్ మెన్ కూడా వచ్చిన వెంటనే చెన్నైపై దాడికి దిగారు. అయితే ఆరంభంలోనే ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ వికెట్ ను సీఎస్కే తీసుకుంది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వ‌చ్చిన  రిలీ రోసోవ్, జానీ బెయిర్‌స్టో అద్భుత ఇన్నింగ్స్ తో పంజాబ్ మ్యాచ్ ను త‌న‌వైపుకు తిప్పుకుంది. బెయిర్‌స్టో 46 పరుగులు చేయగా, రూసో 43 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి వికెట్ల తర్వాత కెప్టెన్ సామ్ కర్రాన్, శశాంక్ సింగ్ పంజాబ్‌కు విజయాన్ని అందించారు. త‌న సొంత గ్రౌండ్ లో ఐపీఎల్ 2024 లో లక్నో తర్వాత పంజాబ్ జ‌ట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్ ను ఓడించింది.

బీసీసీఐకి ఇంగ్లాండ్ షాక్.. తలపట్టుకుంటున్న ఐపీఎల్ ఫ్రాంఛైజీలు..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios